నారాయణపేట: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలపై 27 అర్జీలు సమర్పించారు. వినతులను స్వీకరించిన కలెక్టర్ సీహెచ్ ప్రియాంక పెండింగ్‌లో ఉంచకుండా ప్రాధాన్యత క్రమంలో పరిశీలించి వీలైనంత త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. శాఖల వారీగా ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిశీలించి సత్వర చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీను, డీఆర్‌ఓ రాజేశ్వరి, డిప్యూటీ కలెక్టర్ ఫణికుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
2005లో నాటి ప్రభుత్వం గ్రామ శివారులోని సర్వేనంబర్లు 348, 374, 342, 412, 402లో భూములు కేటాయిస్తూ పట్టాలు జారీ చేసింది. కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు కూడా ఇచ్చా రు. సుమారు 20 ఏళ్లు గడుస్తున్నా.. నేటికీ ఆ భూములు ఎక్కడున్నాయో చూపించలేదు. అప్పటికై నా అధికారులు స్పందించి హద్దులు చూపించాలి.
– 50 మంది పట్టాదారులు,
గుడెబల్లూరు, కృష్ణా మండలం


