సేవలు మరింత చేరువ | - | Sakshi
Sakshi News home page

సేవలు మరింత చేరువ

Jul 28 2026 1:36 AM | Updated on Jul 28 2026 1:36 AM

ప్రతి పోలీస్‌స్టేషన్‌లో సిటిజన్‌ చార్టర్‌

ఏ సేవకు ఎంత గడువు..

బాధ్యులెవరు..

అన్నీ బహిరంగమే...

మధ్యవర్తుల ప్రమేయానికి స్వస్తి

ఎఫ్‌ఐఆర్‌ నుంచి

ఆర్టీఐ వరకు..

–8లో u

నారాయణపేట: పోలీస్‌స్టేషన్‌న్‌కు వెళ్తే ఏ సమస్యకు ఎవరిని కలవాలి? పోలీస్‌ క్లియరెనన్స్‌ సర్టిఫికెట్‌ కోసం ఎక్కడ దరఖాస్తు చేయాలి? పాస్‌పోర్ట్‌ వెరిఫికేషన్‌న్‌ ఎప్పుటిలోగా పూర్తవుతుంది? తదితర ప్రశ్నలు చాలామందిలో తలెత్తుతుంటాయి. ఇలాంటి సందేహాలను నివృత్తి చేయడంతో పాటు పోలీసు సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో జిల్లా పోలీసుశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్పీ డా. వినీత్‌ ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రతి పోలీస్‌స్టేషన్‌లో‘ సిటిజనన్‌ చార్టర్‌ బోర్డులను ప్రదర్శిస్తోంది.

ఫిర్యాదుదారుల స్పష్టత కోసమే..

పోలీసుశాఖ అందించే సేవలు, ఆయా సేవలకు నిర్దేశించిన గడువు, సంబంధిత సేవకు బాధ్యత వహించే అధికారుల వివరాలతో చార్టర్‌ను స్పష్టంగా ప్రదర్శించారు. ప్రజల్లో పోలీసుశాఖపై నమ్మకం పెంచేందుకు ఇది దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఆయా సేవలు పొందేందుకు ప్రజలు మధ్యవర్తులను ఆశ్రయించాల్సిన అవసరం లేదని.. తమ సమస్యలు, అవసరాలకు అనుగుణంగా నేరుగా సంబంధిత పోలీస్‌స్టేషనన్‌లో సంప్రదించాలని సూచిస్తున్నారు. సేవల విషయంలో జాప్యం, నిర్లక్ష్యం లేదా ఇతర సమస్యలు ఎదురైతే నేరుగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లొచ్చు. దీంతో ఓవైపు ప్రజలకు సులభ సేవలు అందుతుండగా.. మరోవైపు అధికారులు కూడా నిర్దిష్ట గడువులోగా స్పందించాల్సిన బాధ్యత మరింత పెరుగుతుంది.

మార్పునకు శ్రీకారం..

ప్రజలకు పోలీసు సేవలు అందించడం మాత్రమే కాకుండా.. ఆ సేవలు ఎలా పొందాలనే దానిపైనా అవగాహన కల్పించడం సిటిజన్‌ చార్టర్‌ ప్రత్యేకత. పోలీసు వ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేయడం, ప్రతి పౌరుడికి పోలీసు సేవలపై అవగాహన కల్పించడం, సేవల్లో పారదర్శకత తీసుకురావడం ప్రధాన లక్ష్యం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement