ప్రత్యేక దృష్టి సారించండి
విస్తారంగా వర్షాలు.. చెరువుల సామర్థ్యం పెరగడంతో..
శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యం
12 ఏళ్లలో రెండింతలకు పైగా..
తెలంగాణ రాష్ట్రం 2014లో ఆవిర్భవించగా.. ఆ ఏడాదిలో ఉమ్మడి పాలమూరు వ్యాప్తంగా వానాకాలం (ఖరీఫ్) సీజన్‌లో సుమారు 8.50 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. స్వరాష్ట్రం సిద్ధించిన 12 ఏళ్ల కాలంలో ఇదే సీజన్‌లో సాగు విస్తీర్ణం రెండింతలకు పైగా పెరిగింది. 2025–26 వానాకాలం సీజన్‌లో 22.54 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేసినట్లు వ్యవసాయ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఈ లెక్కన సుమారు 14 లక్షల ఎకరాల్లో సాగు పెరిగినట్లు తెలుస్తోంది.
యాసంగిలోనూ గణనీయంగా..
ఎండాకాలం సాగుకు సంబంధించి ఉమ్మడి పాలమూరులో గణనీయంగా మార్పు వచ్చింది. 2014లో నాలుగు లక్షల లోపే యాసంగి సాగు అయ్యేది. 2019లో ఇదే సీజన్‌లో 6.72 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు కాగా.. గత ఏడాది 13.44 లక్షల ఎకరాల్లో రైతులు వివధ పంటలు సాగు చేశారు. ఈ లెక్కన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం యాసంగి పంటల సాగు మూడింతలకు పైగా పెరిగినట్లు స్పష్టమవుతోంది.
ప్రధానంగా వరి..
ఉమ్మడి జిల్లాలో రైతులు ప్రధానంగా వరి, పత్తి, మొక్కజొన్న పంటలు సాగు చేస్తున్నారు. వరికి సంబంధించి 2023 ఖరీఫ్‌లో 7,76,311 ఎకరాలు, 2024లో 8,09,784 ఎకరాలు.. గత ఏడాదిలో 8.40 లక్షల ఎకరాల్లో సాగైంది. 2014 ఖరీఫ్‌లోనాలుగు లక్షల ఎకరాల వరకు వరి సాగు కాగా.. ప్రస్తుతం రెండింతలకు పైగా పెరిగినట్లు తెలుస్తోంది. ప్రధానంగా 2019 నుంచి క్రమక్రమంగా రైతులు వరి సాగు వైపు మొగ్గు చూపుతున్నట్లు వ్యవసాయ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి.
అదే దారిలో పత్తి..
ఉమ్మడి పాలమూరులో 2023 ఖరీఫ్‌లో 6,67,824 ఎకరాల్లో, 2024లో 6,04,004 ఎకరాల్లో, గత ఏడాదిలో 7,05,739 ఎకరాల్లో రైతులు తెల్లబంగారం సాగు చేశారు. 2014 వరకు రెండు లక్షల ఎకరాల్లోపు మాత్రమే పత్తి సాగయ్యేది. క్రమక్రమంగా పత్తి సాగు పెరుగుతూ వస్తోంది. అయితే 2023 నుంచి పత్తి సాగు చేసిన వారు సైతం వరి వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఉమ్మడి జిల్లాలో మొక్క జొన్న సాగు స్వల్పంగా పెరుగుతూ వస్తోంది.
తలాపునే కృష్ణమ్మ ఉన్నప్పటికీ కరువుతో అల్లాడిన ప్రాంతం..
ఎటు చూసినా ఎండిన పంటలు..
బీళ్లుగా మారిన భూములు..
తాగు నీటి కోసం తండ్లాట తప్పని పల్లెలు,
పట్టణాలు.. ఉపాధి దొరక్క తట్ట, బుట్ట సర్దుకుని
పిల్లాజెల్లలతో సహా వలసలు..
కిక్కిరిసిన జనాలతో పుణె, బొంబై,
హైదరాబాద్‌కు వెళ్లే బస్సులు..
విద్య, వైద్యానికి నోచుకోని దీన పరిస్థితులు.. భరోసా లేని బతుకులు
...ఇది ఒకప్పటి పాలమూరు ముఖచిత్రం. ఈ జిల్లా వెనుకబాటుతనం,
దయనీయ పరిస్థితులు తెలంగాణ ఉద్యమ
గళంగా మారాయి. ప్రత్యేక రాష్ట్ర సాధనలో
భావజాల వ్యాప్తికి దోహదం చేయడంతో పాటు తెలంగాణ వాదులకు సత్తువనిచ్చాయి. పల్లెపల్లెనా పల్లేర్లు మొలిసే పాలమూరులోనా మన తెలంగాణలోనా.. అనే పాట తెలంగాణ జిల్లాల్లో జ్వాల రగిలించడమే ఇందుకు నిదర్శనం.
తెలంగాణ ఆకాంక్ష, ‘ప్రత్యేక’ పోరుకు దిక్సూచిగా నిలిచిన పాలమూరు రూపురేఖలు స్వరాష్ట్రంలో క్రమక్రమంగా మారుతున్నాయి. నెర్రెలు బారిన వ్యవసాయ భూముల్లో సిరుల పంటలు పండుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి పుష్కర కాలమైన నేపథ్యంలో ‘సాక్షి’ ప్రత్యేక కథనం..
– సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్
ఉమ్మడి జిల్లాలో
గణనీయంగా పెరిగిన సాగు విస్తీర్ణం
2014కు ముందు వానాకాలంలో 8.50 లక్షల ఎకరాల్లోపే..
ప్రస్తుతం 22.54 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు
యాసంగి సాగులోనూ
మూడింతల వృద్ధి
వరి, పత్తి వైపే రైతన్నల మొగ్గు
జిల్లా పరిపాలనలో ప్రస్తుతం అత్యంత ప్రాధాన్యత పొందుతున్న భూ భారతి, సాదాబైనామా దరఖాస్తులు, ఓటరు జాబితా ప్రత్యేక సవరణపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక ఆదేశించారు. కలెక్టరేట్ వీసీ హాల్‌లో అదనపు కలెక్టర్ శ్రీను, డీఆర్వో రాజేశ్వరితో తహసీల్దార్లతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న భూ భారతి కా ర్యక్రమం ద్వారా భూ రికార్డుల శుద్ధీకరణ, యాజమాన్య హక్కుల స్పష్టతకు చర్యలు కొనసాగుతున్నా.. కొన్ని మండలాల్లో దరఖాస్తుల పరిశీలన, పరిష్కార ప్రక్రియ ఆశించిన స్థాయిలో లేదన్నారు. పెండింగ్ దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించి.. రైతులు, భూ యజమానులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. అదే విధంగా దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న సాదాబైనామా భూముల సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. ప్రజావాణిలో అందుతున్న ఫిర్యాదుల పరిష్కారం ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతుందని.. భూ వివాదా లు, ఆదాయ ధృవపత్రాలు, పాస్‌బుక్‌లు, సర్వే లు, ఇతర రెవెన్యూ సమస్యలపై ప్రజలు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు చేస్తున్న నేపథ్యంలో ప్రతి ఫిర్యాదును వారం రోజుల్లోగా పరిష్కరించాలని స్పష్టంచేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో రాజకీ య పార్టీల భాగస్వామ్యం కీలకమన్నారు. ముఖ్యంగా బూత్ లెవల్ ఏజెంట్లు ఓటరు జాబితా పరిశీలనలో కీలక పాత్ర పోషించాలని కలెక్టర్ సూచించారు.
నారాయణపేట: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల ప్రశాంత జీవనానికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడాలనే లక్ష్యంతో జిల్లావ్యాప్తంగా సెక్షన్–30 పోలీస్ యాక్ట్ అమలుచేస్తున్నట్లు ఎస్పీ డా.వినీత్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 30వ తేదీ వర కు నిబంధనలు అమలులో ఉంటాయని పేర్కొన్నారు. ఇటీవల వివిధ అంశాలపై నిరసనలు, ఆందోళనలు, సామాజిక మాధ్యమాల్లో రెచ్చ గొట్టే పోస్టులు పెరుగుతున్న నేపథ్యంలో ఎ లాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రజలు, రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థలు, సంఘాలు నిర్వహించే ర్యాలీలు, ధర్నాలు, ఊరేగింపులు, సభలు, సమావేశాలు, బహిరంగ కార్యక్రమాల కు ముందస్తుగా పోలీసు అనుమతులను తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. అనుమతులు లేకుండా కార్యక్రమాలు నిర్వహించడం, ప్రజలను గుమికూడించడం, ట్రాఫిక్‌కు అంతరా యం కలిగించడం, శాంతిభద్రతలకు విఘా తం కలిగించే చర్యలకు పాల్పడితే సంబంధిత నిర్వాహకులపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. సామాజిక మాధ్యమాల ద్వారా మత విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు, అసత్య ప్రచారాలపై పోలీసుశాఖ ప్రత్యేక నిఘా ఉంచిందని తెలిపారు. ప్రజలందరూ పోలీసు శాఖకు సహకరించి జిల్లాలో ప్రశాంత వాతావరణం కొనసాగేందుకు తోడ్పాటు అందించాలని కోరారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఉమ్మడి జిల్లాలో మహాత్మాగాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు పలు ఎత్తిపోతల పథకాలు ఉన్నప్పటికీ.. నీరును నిల్వ చేసేందుకు రిజర్వా య ర్లు లేవు. కొంత మేర మాత్రమే సాగు నీరందుతుండగా.. రైతులు ప్రధానంగా వర్షాధారం, బోర్లపై ఆధారపడి పంటలు సాగు చేస్తున్నారు. సాగు నీ టి వసతులు ఇంకా పెరగాల్సి ఉన్నప్పటికీ.. మిషన్ కాకతీయతో చెరువుల్లో నీటి సామర్థ్యం పెరిగింది. వి స్తారంగా వర్షాలు కురవడం.. భూగ ర్భ జలాలు పెరగడంతో సాగులో గణనీయ వృద్ధి సాధ్యమైందని రైతు లు, రైతు సంఘాలు నాయకులు అభిప్రాయపడుతున్నారు. వ్యవసాయాని కి ఉచిత విద్యుత్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడి సాయం ఇస్తుండడం, రుణమాఫీ, వరికి బోనస్ వంటి పథకాలు సైతం ఉమ్మడి జిల్లాలో సాగు గణనీయంగా పెరిగేందుకు దోహదపడ్డాయని చెబుతున్నారు.


