పాలిసెట్‌ వెబ్‌ కౌన్సెలింగ్‌ జాగ్రత్తగా చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

పాలిసెట్‌ వెబ్‌ కౌన్సెలింగ్‌ జాగ్రత్తగా చేపట్టాలి

May 20 2026 10:19 AM | Updated on May 20 2026 10:19 AM

కోస్గి రూరల్‌: రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న 2026–27 పాలిసెట్‌ వెబ్‌ కౌన్సెలింగ్‌ జాగ్రత్తగా చేపట్టాలని పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీనివాసులు మంగళవారం తెలిపారు. అర్హత సాధించిన వి ద్యార్థులు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లింపులను ఈ నెల 27 నుంచి 31వ తేదీ వరకు, సర్టిఫికెట్‌ వె రిఫికేషన్‌ 29వ తేదీ నుంచి జూన్‌ 1 వరకు, వెబ్‌ ఆప్షన్లను 29వ తేదీ నుంచి జూన్‌ 3 వరకు, సీట్ల కేటాయింపు జూన్‌ 6న జరుగుతుందన్నా రు. ఫీజు చెల్లింపు, సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ జూన్‌ 6 నుంచి 9వ తేదీ వరకు కళాశాలల్లో రిపోర్టింగ్‌ జూన్‌ 8, 9 తేదీల్లో జరుగుతాయని వివరించారు.

జీలుగ సాగుతో

భూ సారం మెరుగు

కోస్గి రూరల్‌/కొత్తపల్లి: వ్యవసాయ భూముల్లో కర్భన శాతాన్ని పెంచి నేల సారాన్ని మెరుగుపర్చడానికి జీలుగ ఎంతో దోహదం చేస్తుందని ఏడీఏ రామకృష్ణ అన్నారు. మద్దూర్‌ మండలం పల్లెర్ల రైతువేదికలో మంగళవారం రైతులకు జీలుగ విత్తనాలు పంపిణీ చేసి మాట్లాడారు. జీలుగను పచ్చిరొట్ట ఎరువుగా సాగు చేయడంతో నేలలో నత్రజని స్థిరీకరణ జరిగి భూమి ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు రసాయన ఎరువుల వినియోగం గణనీయంగా తగ్గించవచ్చన్నారు. జీలుగ విత్తనాలు క్వింటా రూ.16,350 కాగా.. రాయితీపై రూ.8,175 అందిస్తున్నట్లు తెలిపారు. కోస్గిలోని ఆగ్రోస్‌–1, ఆగ్రోస్‌–2, మద్దూర్‌లోని ఆగ్రోస్‌ రైతుకేంద్రంలో విత్తనాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. క్లస్టర్‌ పరిధిలోని ఏఈఓలను సంప్రదించి వారి అనుమతితో విత్తనాలు పొందాలని సూచించారు. కార్యక్రమంలో మద్దూర్‌ మండల వ్యవసాయ అధికారి ప్రవీణ్‌కుమార్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ నర్సింహులు, ఉప సర్పంచ్‌ వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నకిలీ విత్తనాలు

విక్రయిస్తే చర్యలు

దామరగిద్ద: నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయ అధికారి జాన్‌సుధాకర్‌ హెచ్చరించారు. మంగళవారం మండలకేంద్రంలోని ఆగ్రోస్‌ రైతు సేవాకేంద్రాలు, ఇతర ఫర్టిలైజర్‌ దుకాణాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎరువుల నిల్వలను పరిశీలించి.. ఈ–పాస్‌ యంత్రంలో నమోదు చేసి విక్రయించాలని నిర్వాహకులకు సూచించారు. వానాకాలం సాగుకు అవసరమైన నాణ్యమైన విత్తనాలను అందుబాటులో ఉంచాలని, కొనుగోలు చేసిన రైతులకు విధిగా బిల్లులు అందించాలని ఆదేశించారు. నకిలీ వి త్తనాలు కొని మోసపోవద్దని రైతులకు సూచించారు. ఆయన వెంట మండల వ్యవసాయ అధికారి బాలాజీప్రసాద్‌ తదితరులు ఉన్నారు.

బంగారు దుకాణాల

బంద్‌ ప్రశాంతం

నారాయణపేట: కేంద్ర ప్రభుత్వం బంగారం దిగుమతులపై పెంచిన సుంకాన్ని వెంటనే తగ్గించాలని నారాయణపేట బులియన్‌ మర్చంట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు హరినారాయణ భట్టడ్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని సరాఫ్‌బజార్‌లో నారాయణపేట బులియన్‌ మర్చంట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఒకరోజు బంద్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బంగారు వ్యాపారంపై లక్షలాది కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయని, బంగారం, వెండి ధరలు పెరగడంతో సామాన్యులు, పేద కుటుంబాల పెళ్లిళ్లు భారంగా మారే పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బంగారం, వెండి దిగుమతులపై కేంద్రం విధిస్తున్న అధిక సుంకాలతో సరఫరా వ్యవస్థలో అనిశ్ఛితి నెలకొందని.. దీని ప్రభావం పెద్ద వ్యాపారులకే కాకుండా చిన్న, మధ్యతరగతి బంగారు దుకాణాలు, ఆభరణాల తయారీ కార్మికులు, ఉద్యోగులపై తీవ్రంగా ఉందని తెలిపారు. జ్యువెలరీ రంగానికి ప్రోత్సాహకాలు అందిస్తూ పారదర్శకతతో కూడిన సులభ వ్యాపార వాతావరణం కల్పించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం పలు డిమాండ్ల వినతిపత్రాన్ని కలెక్టరేట్‌లో కలెక్టర్‌ సీహెచ్‌ ప్రియాంకకు అందజేశారు. కార్యక్రమంలో సరాఫ్‌ నాగరాజు, శ్రీకాంత్‌ చామకూర, వెంకటయ్య, షఫీచాంద్‌, దస్తగిరి చాంద్‌, పవన్‌కుమార్‌ వైకుంఠ్‌, వామన్‌గేరి కార్తీక్‌, సాకేత్‌ భట్టడ్‌, సంగంనాథ్‌ హీరేమఠ్‌ తదితరులతో పాటు మరికల్‌, మక్తల్‌, మద్దూరు మండలాల నుంచి బులియన్‌ వ్యాపారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement