వరి ధాన్యం.. వర్షార్పణం | - | Sakshi
Sakshi News home page

వరి ధాన్యం.. వర్షార్పణం

May 20 2026 10:19 AM | Updated on May 20 2026 10:19 AM

వర్షానికి కొట్టుకుపోయిన వరి ధాన్యం

వర్షపు నీటిలో తడిసిన ధాన్యాన్ని ఎత్తుతున్న రైతులు

రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన వరి ధాన్యం మంగళవారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి

తడిసిపోయింది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో స్థానిక రాంలాలీ మైదానంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో అధికారుల నిర్లక్ష్యానికి ధాన్యం తడిసిందని రైతులు ఆరోపిస్తున్నారు. కేంద్రానికి వచ్చిన లారీలను ఇతర ప్రాంతాలకు పంపించడం, ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపోవడంతోనే తడిసినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతున్నారు. – కోస్గి రూరల్‌

Advertisement
 
Advertisement
Advertisement