చెక్‌పోస్ట్‌ల వద్ద అప్రమత్తత అవసరం : డీఎస్పీ | - | Sakshi
Sakshi News home page

చెక్‌పోస్ట్‌ల వద్ద అప్రమత్తత అవసరం : డీఎస్పీ

May 20 2026 10:19 AM | Updated on May 20 2026 10:19 AM

నారాయణపేట: చెక్‌పోస్ట్‌ల వద్ద సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని ఇన్‌చార్జ్‌ డీఎస్పీ మహేశ్‌ ఆదేశించారు. జిల్లాకేంద్రం సమీపంలోని ఎర్రగుట్ట వద్ద ఏర్పాటు చేసిన సరిహద్దు చెక్‌పోస్ట్‌ను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. పోలీసు సిబ్బందితో పాటు పశువైద్యులు కూడా అందుబాటులో ఉండాలని తెలిపారు. పశువుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చెక్‌పోస్ట్‌ వద్ద విధులు నిర్వర్తించే సిబ్బందికి మూడు షిఫ్టులుగా విధులు కేటాయించాలని సీఐ శివశంకర్‌, ఎస్‌ఐ వెంకటేశ్వర్లుకు సూచించారు. తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న పశువులను గోశాలకు పంపించాలని, ఇందుకు సంబంధించిన తాత్కాలిక షెల్టర్‌ను పరిశీలించారు. బక్రీద్‌ పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకొని పోలీసులకు సహకరించాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement