పీయూ పరిధిలో చదువుతున్న విద్యార్థులకు స్కిల్స్ అందించేలా అధికారుల కసరత్తు
● టీసీఐఎల్‌తో ఒప్పందం, పోటీ పరీక్షలు ఇతర స్కిల్ డెవలప్‌మెంట్‌కు ఆన్‌లైన్ శిక్షణ
● ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న
32,892 మంది విద్యార్థులు
● పీఎంఐఎస్ ద్వారా ఇంటర్న్‌షిప్, స్కాలర్‌షిప్ పొందే అవకాశం
● డీట్ యాప్‌లో దరఖాస్తు చేసుకుంటే ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని విద్యార్థులు వారు చదివిన కోర్సులకు అనుగుణంగా ఉద్యోగాలు సాధించేందుకు యూనివర్సిటీ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. కళాశాల స్థాయిలో ఉన్నప్పుడే ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాలు సాధించేలా ఇంటర్వ్యూ, కమ్యూనికేషన్ స్కిల్స్, కాగ్నిటివ్ స్కిల్ పెంపొందించేలా పలు సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారు. వీటితో పాటు టెక్నికల్ ఎడ్యుకేషన్, ఫార్మ, ఎంబీఏ, ఎంసీఏతో పాటు ఇతర కోర్సుల విద్యార్థులకు కళాశాల స్థాయిలోనే ఇంటర్న్‌షిప్‌కు అవకాశం కల్పించనునున్నారు. వీటి ద్వారా స్కాలర్‌షిప్‌తో పాటు విద్యార్థి అనుభవం కూడా పొందనున్నారు. డీట్ (డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ తెలంగాణ) యాప్‌నకు సంబంధించి పీయూ పరిధిలోని వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లతో ఆన్‌లైన్ సమావేశం నిర్వహించగా.. హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ బాలకిష్టారెడ్డి పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వ సంస్థతో ఒప్పందం..
విద్యార్థులకు ఇంటర్వ్యూలు, పోటీ పరీక్షలకు సిద్ధమవడంతోపాటు పలు రకాల శిక్షణ అందించేందుకు కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థ టీసీఐఎల్ (టెలీకమ్యూనికేషన్ కన్సల్టెన్సీ ఇండియా లిమిటెడ్)తో అధికారులు ఒప్పందం చేసుకున్నారు. దీని ద్వారా పీయూ పరిధిలోని 112 కళాశాలల్లో చదువుతున్న 32,892 మంది విద్యార్థులు ఆన్‌లైన్ శిక్షణ కోసం దరఖాస్తు చేసుకున్నారు. విద్యార్థి టెక్నికల్, నాన్ టెక్నికల్ వంటి వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరిస్తే వారికి అవసరమైన కోర్సులు చూపిస్తుంది. విద్యార్థి ఏ రకమైన కోర్సు కావాలో ఎంపిక చేసుకుంటే అందుకు సంబంధించి వివరాలు వస్తాయి. ఇలా విద్యార్థికి వచ్చిన స్టడీ మెటీరియల్, కంటెంట్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. విద్యార్థి దీన్ని ఖాళీ సమయంలో ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్‌లో కూడా చేయవచ్చు.
విద్యార్థులు చదువు పూర్తయ్యాక ప్రైవేటు సెక్టార్‌లో, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం డీట్ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని పేరు, కోర్సుతో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేటు కంపెనీలు యాప్‌లో ఇందులో రిజిస్ట్రేషన్ అయ్యి ఉండడం ద్వారా విద్యార్థి అర్హతను బట్టి ఏ ఉద్యోగం కావాలో యాప్‌లో పొందే అవకాశం లభిస్తుంది. ఈ క్రమంలో యాప్‌లో విద్యార్థులు దరఖాస్తులు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ బాలకిష్టారెడ్డి, వీసీ శ్రీనివాస్, రిజిస్ట్రార్ రమేష్‌బాబు ఆన్‌లైన్ ద్వారా సమావేశం ఏర్పాటు చేయగా.. పీయూ పరిధిలోని 80 కళాశాలల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.
ప్రైమినిస్టర్ ఇంటర్న్‌షిప్..
విద్యార్థులకు కళాశాల స్థాయిలోనే తమ వృత్తి నైపుణ్యాలను మెరుగుపర్చుకునేందుకు అధికారులు అవకాశం కల్పించారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ప్రైమినిస్టర్ ఇంటర్న్‌షిప్ స్కీంను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో కళాశాల స్థాయిలో చదువుతున్న విద్యార్థులు తాము ప్రాక్టికల్‌గా సబ్జెక్టు, వృత్తి నైపుణ్యాలు పెంచుకునేలా ఆయా కంపెనీలు, సంస్థల్లో చేరి ఇంటర్న్‌షిప్ చేసేందుకు ఆస్కారం ఉంది. ఇందులో ఇంటర్న్‌షిప్ చేసిన వారికి రూ.6 వేల నుంచి రూ.50 వేల వరకు స్కాలర్‌షిప్ లభిస్తుంది. దీంతో పాటు ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్‌లో మార్కులు కూడా వేయనున్నారు. పేద విద్యార్థులు ఇంటర్న్‌షిప్ చేసి ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా చదివేందుకు ఇది దోహదపడుతుంది. ఈ స్కీం ద్వారా ఇప్పటికే పలువురు విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా వీటి ద్వారా నచ్చిన సంస్థల్లో ఇంటర్న్‌షిప్ చేయవచ్చు.
డీట్‌తో
ఉద్యోగాలు..


