నిర్ణీత గడువులోగా సీఎంఆర్‌ అప్పగించాలి | - | Sakshi
Sakshi News home page

నిర్ణీత గడువులోగా సీఎంఆర్‌ అప్పగించాలి

Apr 8 2026 8:02 AM | Updated on Apr 8 2026 8:02 AM

నారాయణపేట: రైస్‌ మిల్లర్లు నిర్ణీత గడువులోగా సీఎంఆర్‌ ప్రభుత్వానికి అప్పగించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్‌ శ్రీను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీసీ మందిరంలో పౌరసరఫరాలసంస్థ డీఎం సైదులుతో కలిసి రైస్‌మిల్లర్లు, పౌరసరఫరాలశాఖ డీటీలతో 2025–26 వానాకాలం సీఎంఆర్‌పై సమీక్ష నిర్వహించారు. 2025–26 యాసంగి వరి ధాన్యం కేటాయింపునకు బ్యాంకు గ్యారెంటీలు, ఒప్పందాలు సమర్పించాలని, అలాగే మిగిలిన గన్నీ బ్యాగులను వెంటనే తిరిగి ఇవ్వాలని ఆదేశాలు జారీ అయ్యాయని వివరించారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి బాలరాజు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement