పీయూ పరిధిలో చదువుతున్న విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. పీఎం ఇంటర్న్‌షిప్ ద్వారా కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు నేరుగా ఇంటర్న్‌షిప్ చేసేందుకు వీలుపడుతుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన డీట్ యాప్ ద్వారా విద్యార్థుల చదువులు పూర్తయ్యాక వెంటనే ఉద్యోగాలు పొందేలా స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణ ఇస్తున్నాం. పీయూ పరిధిలో చదువుతున్న వారిని కార్పొరేట్ సెక్టార్‌కు అవసరమైన విధంగా తీర్చిదిద్దుతాం.
– శ్రీనివాస్, వీసీ, పీయూ
విద్యార్థులకు సువర్ణావకాశం...
పీయూలో తీసుకుంటున్న నిర్ణయాలతో విద్యార్థులు తమ స్కిల్స్ పెంపొందించుకోవడంతో పాటు త్వరగా ఉద్యోగాలు పొందేందుకు ఆస్కారం లభిస్తుంది. అందుకే పీయూలో ప్రభుత్వం తీసుకువచ్చిన పీఎం ఇంటర్న్‌షిప్‌తో పాటు టీసీఐఎల్ ద్వారా శిక్షణ ఇస్తున్నాం. ఇప్పటికే ఇందులో 32 వేలకు పైగా విద్యార్థులు చేరారు. పలువురు ఆన్‌లైన్ శిక్షణ పొందుతున్నారు. ప్రతి విద్యార్థి కూడా చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగాలు పొందాలన్న లక్ష్యంతో పని చేస్తున్నాం.
– రమేష్‌బాబు, రిజిస్ట్రార్, పీయూ
●


