160 కేంద్రాల
ఏర్పాటుకు సన్నాహాలు
● జిల్లాలో 1.80 లక్షల ఎకరాల్లో వరి సాగు
● 2.45 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణే లక్ష్యం
● 51 రైస్‌మిల్లులకు ధాన్యం కేటాయింపులు
● రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు
–8లో u
నర్వ: జిల్లాలో యాసంగి వరి ధాన్యం కొనుగోళ్లకు సంబంధిత శాఖల అధికారులు సన్నాహాలు చేపడుతున్నారు. ఇందుకు సంబంధించి కలెక్టర్ ఆయా అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ప్రాథమిక సహకార సంఘం, మెప్మా, పీఏసీఎస్ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా మొత్తం 160 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. పంట కోతల ఆధారంగా ఈ నెల రెండో వారం నుంచి కేంద్రాలను ప్రారంభించనున్నారు. ఈ సీజన్‌లో జిల్లావ్యాప్తంగా 2,44,813 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని అధికారులు లక్ష్యంగా నిర్ణయించారు. కాగా 2 లక్షల మెట్రిక్ టన్నుల వరకు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కొనుగోళ్లు ప్రారంభం కాగానే మరిన్ని చెప్పించాలని సూచించారు.
ప్రైవేట్‌ను ఆశ్రయించకుండా..
జిల్లావ్యాప్తంగా 1.80 లక్షల ఎకరాల్లో వరి పంట సాగైంది. పంట నూర్పిళ్లు ప్రారంభించే నాటికి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రభుత్వం ఏ–గ్రేడ్ ధాన్యం క్వింటాకు రూ.2,380, సాధారణ రకం క్వింటాకు రూ.2,360 మద్దతు ధర నిర్ణయించారు.
4.37 లక్షల మె.ట. దిగుబడి..
జిల్లాలోని 13 మండలాల్లో 1.80 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు అంచనా ఉండగా 4,37,167 మెట్రిక్ టన్నుల పంట ధాన్యం దిగుబడి రానుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇందులో 1,92,354 మెట్రిక్ టన్నులు బయట మార్కెట్‌కు వెళ్లే అవకాశం ఉండగా.. మిగిలిన ధాన్యం పౌరసరఫరాలశాఖ ద్వారా సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.


