నారాయణపేట రూరల్: బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు యాద్గిర్ జనార్దన్‌రెడ్డి అన్నారు. ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన ఉపాధ్యాయుడు ఫయాజుద్దీన్ కుటుంబానికి మంగళవారం సంఘం తరఫున రూ.లక్ష ఆర్థిక సాయాన్ని జిల్లా విద్యాధికారి గోవిందరాజు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల కుటుంబ రక్షణకు ఏర్పాటుచేసిన సంఘ సంక్షేమనిధి నుంచి డబ్బులను చెక్కు రూపంలో అందించామన్నారు. భవిష్యత్‌లోనూ అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎంఈఓ బాలాజీ, బాధిత కుటుంబ సభ్యులు కౌసర్ బేగం, ఫసియోద్దీన్, సంఘం నాయకుడు వాణిశ్రీ, జహీరుద్దీన్, రఘువీర్, సత్యనారాయణరెడ్డి, హనీఫ్, నరేష్, శ్రీనివాస్, అరవింద్, బాలాజీ పాల్గొన్నారు.


