మహిళల అక్షరాస్యత పెరగాలి | - | Sakshi
Sakshi News home page

మహిళల అక్షరాస్యత పెరగాలి

Mar 30 2026 1:06 PM | Updated on Mar 30 2026 1:06 PM

మరికల్‌: గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల్లో అక్షరాస్యత శాతం పెంచేందుకు ప్రభుత్వం ఉల్లాస్‌ నవభారత్‌ సాక్షరత కార్యక్రమం చేపట్టిందని జిల్లా విద్యాధికారి గోవిందరాజు అన్నారు. ఆదివారం మండలంలోని పెద్దచింతకుంట, మాధవరం గ్రామాల్లో ఉల్లాస్‌ నవభారత్‌ సాక్షరత ద్వారా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓపెన్‌ స్కూలింగ్‌కు వస్తున్న మహిళలకు పరీక్షలు నిర్వహించారు. డీఈఓ గోవిందరాజుతో పాటు డీపీఎం గోవింద్‌, ఏపీవో అనిల్‌ పరీక్షలను పర్యవేక్షించారు. గ్రామీణ మహిళలు అభివృద్ధి చెందాలంటే చదువు నేర్చుకోవడం ఎంతో అవసరమన్నారు. అధికసంఖ్యలో మహిళలు అక్షరాస్యత సాధించాలని కోరారు.ఏపీఎం చెన్నప్ప, హన్మంతు, వీఓఏలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement