ఎర్రవల్లి: బీచుపల్లి కోదండరామస్వామి ఆలయంలో శనివారం సీతారాముల పట్టాభిషేకం కార్యక్రమాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదోరోజు ఉదయం ఆలయంలో అర్చకులు సుప్రభాతసేవ, తిరుప్పావై తోమాల, నైవేద్యం, తీర్థప్రసాదగోష్టి తదనంతరం విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, కలశపూజ, అభిషేకం, వస్త్ర, ఆభరణ సమర్పన, హోమం, పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం సామ్రాజ్య పట్టాభిషేకం కార్యక్రమాన్ని మంగళవాయిద్యాల మధ్య కనులపండువగా చేపట్టారు. కార్యక్రమంలో ఆలయ మేనేజర్ సురేందర్‌రాజు, అర్చకులు, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.


