మన్సూర్‌పల్లిలో మళ్లీ కనిపించిన చిరుతలు మెడికల్‌ షాపుల్లో నకిలీ డ్రగ్స్‌ కట్టడికిబల్క్‌ ఎస్‌ఎంఎస్‌ విధానం | - | Sakshi
Sakshi News home page

మన్సూర్‌పల్లిలో మళ్లీ కనిపించిన చిరుతలు మెడికల్‌ షాపుల్లో నకిలీ డ్రగ్స్‌ కట్టడికిబల్క్‌ ఎస్‌ఎంఎస్‌ విధానం

Mar 28 2026 10:33 AM | Updated on Mar 28 2026 10:33 AM

రాష్ట్ర రవాణాశాఖ

మంత్రిని కలిసిన ఎమ్మెల్యే

నారాయణపేట: రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను శుక్రవారం ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి, మంత్రి వాకిటి శ్రీహరి కలిశారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని, సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే వినతిపత్రం అందజేశారు. ఇందుకు మంత్రి సానూకూలంగా స్పందించినట్లు తెలియజేశారు.

సమగ్ర అభివృద్ధికి కదలిరావాలి

నారాయణపేట: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నేతృత్వంలో ఆవిర్భాస్తున్న నూతన పార్టీలో చేరి సమగ్ర అభివృద్ధికి కదలిరావాలని తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు గౌవినోళ్ల శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడారు. కొత్త రాజకీయ పార్టీ బలోపేతానికి జిల్లాలో కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయని.. యువత, రైతులు, తెలంగాణ ఉద్యమకారులు, మహిళలు, నిరుద్యోగులు, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు అన్నివర్గాల ప్రజలను హృదయపూర్వకంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నామన్నారు. త్వరలో అన్ని గ్రామాలు, మండల కేంద్రాలు, పురపాలికల్లో సమావేశాలు నిర్వహించి కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రజా సమస్యలపై పోరాడేందుకు కంకణబద్దులు కావాలని కోరారు.

– వివరాలు 8లో..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement