జగమంతా రామమయం | - | Sakshi
Sakshi News home page

జగమంతా రామమయం

Mar 28 2026 10:32 AM | Updated on Mar 28 2026 10:32 AM

పేటలో మార్మోగిన శ్రీరామ నామం

కిటకిటలాడిన ఆలయాలు

మక్తల్‌లో సీతారాముల కల్యాణోత్సవానికి హాజరైన భక్తులు

కల్యాణ క్రతువు నిర్వహిస్తున్న అర్చకులు

నాారాయణపేట: జిల్లాలో శుక్రవారం శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరిగాయి. పట్టణంలోని మూల హనుమాన్‌ ఆలయ ప్రాంగణంలో శుక్రవారం హనుమాన్‌ భక్తబృందం ఆధ్వర్యంలో అర్చకులు శ్రీపతిజ్యోషి రఘుప్రేమ్‌, రవితేజ ఆచార్య మంత్రోచ్ఛారణల నడుమ సీతారాముల కల్యాణం కనులపండుగా నిర్వహించారు. సీతారాముల కల్యాణ ఘట్టాన్ని జ్యోషి రఘుప్రేమ్‌ భక్తులకు వివరించారు. అంతకుముందు ప్రధాన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కల్యాణం అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. కార్యక్రమంలో హనుమాన్‌ భక్తబృందం సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.

రామాలయంలో డోలారోహణం..

బ్రాహ్మణవాడి రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా అర్చకులు రాఘవేంద్ర సీతారామ లక్ష్మణుల మూల విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి డోలారోహణం జరిగింది.

మక్తల్‌ రాంలీలా మైదానంలో..

మక్తల్‌: పట్టణంలోని పడమటి ఆంజనేయస్వామి దేవాలయం పక్కనున్న రాంలీలా మైదానంలో శుక్రవారం శ్రీ సీతారాముల కల్యాణోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మంత్రి వాకిటి శ్రీహరి సోదరుడు వాకిటి శేషగిరి దంపతులు, పుర చైర్‌పర్సన్‌ వాకిటి మానస దంపతులు, బీకేఆర్‌ చై ర్మన్‌ బాలకృష్ణారెడ్డి దంపతులు ఆలయంలో ప్రత్యే క పూజలు చేశారు. అనంతరం కల్యాణ వేదిక వద్ద కు ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు తీసుకొచ్చారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే కొత్తకోట సీతా దయాకర్‌రెడ్డి తరఫున మాజీ ఎంపీటీసీ మధు సూదన్‌రెడ్డి ముత్యాల తలబ్రాలు అందజేశారు. మధ్యాహ్నం 12.30 గంటలకు వేదపండితులు రాఘవేందర్‌చారి స్వామివారి కల్యాణం అత్యంత వైభవంగా జరిపించారు. సంగంబండకు చెందిన బీకేఆర్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ బాలకృష్ణారెడ్డి అన్న ప్రసాద వితరణ చేపట్టారు. అంతకుముందు సీతారాముల విగ్రహాలను పట్టణంలో ఊరేగించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, మక్తల్‌ మార్కెట్‌ చైర్మన్‌ రాధమ్మ, శ్రీనివాస్‌గుప్తా, బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు కొండయ్య, మాజీ మార్కెట్‌ చైర్మన్‌ నర్సింహగౌడ్‌, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement