బీడీ కార్మికులకు కూలిరేట్లు పెంచాలి | - | Sakshi
Sakshi News home page

బీడీ కార్మికులకు కూలిరేట్లు పెంచాలి

Mar 29 2026 8:51 AM | Updated on Mar 29 2026 8:51 AM

చిన్నచింతకుంట: యాజమాన్యం ఒప్పందం ప్రకారం బీడీ కార్మికులకు కూలి పెంచాలని తెలంగాణ బీడీ సిగర్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట ఉపాధ్యక్షులు ఎండీ మహిమూద్‌ డిమాండ్‌ చేశారు. మండలకేంద్రంలో శనివారం బీడీ కార్మికుల విస్తృత సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై కార్మికులతో కలిసి రెడ్డి బీడీ ఫ్యాక్టరీ యజమాని విఘ్ణువర్ధన్‌రెడ్డికి డిమాండ్‌ నోటీస్‌ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీడీ కార్మికులు చాలీచాలని కూలితో జీవనోపాధికి ఇబ్బందులు పడుతున్నారన్నారు. పెరిగిన నిత్యావసర ధరలతో ఏమీ కొనలేని పరిస్థితుల్లో కార్మికులు కొట్టుమిట్టాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీడీ ఫ్యాక్టరీ యాజమాన్యం కూలి రేటు పెంపుపై తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. గతేడాది కూలి రేటు ఒప్పందం ఈనెల 31ముగుస్తుందన్నారు. అందుకు ఈ సంవత్సరం పెరుగుతున్న ధరలకు అణుగునంగా కూలి రేట్లు పెంచి కార్మికులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో బీడీ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్‌, నాయకులు ఆర్‌ఎన్‌ రమేష్‌, రాజు, బుచ్చన్నతోపాటు పలువురు ఉన్నారు.

లోక్‌ అదాలత్‌లో 5,149 కేసులు పరిష్కారం

నారాయపేట: జాతీయ లోక్‌ అదాలత్‌లో 5,149 కేసులు రాజీమార్గంలో పరిష్కారమైనట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి బోయ శ్రీనివాసులు తెలిపారు. శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంలో జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ ఆధ్వర్యంలో 5 బేంచ్‌లను ఏర్పాటు చేసి జిల్లా న్యాయసేవాధికాసంస్థ కార్యదర్శి, ప్రిన్సిపల్‌ డిస్ట్రిక్ట్‌ అండ్‌ సెషన్స్‌ జడ్జి సమక్షంలో కేసులను విచారించారు. జిల్లాలోని 14 పోలీస్‌స్టేషన్లతో పాటు కోస్గి, నారాయణపేట ఎకై ్సజ్‌ పోలీస్‌స్టేషన్ల పరిధిలోని కేసులను న్యాయవాదులు సహకరించి పరిష్కారానికి కృషి చేశారు. కేసుల పరిష్కారంతో రూ.22,99,217 ఆదాయం ప్రభుత్వానికి సమకూరిందని ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. లోక్‌అదాలత్‌లో సీనియర్‌ సివిల్‌ జడ్జి వింధ్యానాయక్‌, జూనియర్‌ సివిల్‌ జడ్జి సాయిమనోజ్‌, అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి అవినాష్‌, సుష్మిత, న్యాయవాదులు, కక్షిదారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement