పార్టీలకతీతంగా గ్రామాల అభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

పార్టీలకతీతంగా గ్రామాల అభివృద్ధి

Mar 29 2026 8:52 AM | Updated on Mar 29 2026 8:52 AM

మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ

మరికల్‌: కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులతో పార్టీలకు అతీతంగా గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ అన్నారు. శనివారం మండలంలోని వెంకటాపూర్‌లో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ కార్యాలయ భవనాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. కేంద్ర నిధులను సక్రమంగా వినియోగించాలని సర్పంచులకు సూచించారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధుల గడువు ఈ నెల 31తో ముగియనుండగా.. కేంద్ర మంత్రితో మాట్లాడి పనులు పూర్తి చేయడానికి సమయం సరిపోవడం లేదని ఏప్రిల్‌ 10 వరకు గడువు పొడిగించినట్లు చెప్పారు. గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి ఉచితంగా స్థలం ఇచ్చిన మాజీ సర్పంచ్‌ కళావతమ్మ, ప్రస్తుత సర్పంచ్‌ విజయ్‌కుమార్‌రెడ్డిని ఆమె అభినందించారు.

కొత్త భవనంలో సర్పంచ్‌ను కుర్చీలో కూర్చోబెట్టారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌పార్టీ జిల్లా నాయకులు సూర్యమోహన్‌రెడ్డి, వీరన్న, కృష్ణయ్య, హరీశ్‌, రాజేష్‌, నరేష్‌, మురళి, కుర్మన్న, ఉపసర్పంచ్‌, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

వాటర్‌ ప్లాంట్‌ ప్రారంభం..

గ్రామ పంచాయతీ కార్యాలయంలో సూర్యచంద్ర ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శుద్ధజల కేంద్రాన్ని శనివారం ఎంపీ డీకే అరుణ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామస్తులు ఏళ్ల తరబడి ఫ్లోరైడ్‌ నీటితో ఇబ్బందులు పడుతుండడంతో సూర్యచంద్ర ఫౌండేషన్‌ అధినేత సూర్యమోహన్‌రెడ్డి వాటర్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడం అభినందయమన్నారు. ప్రజలందరూ ఈ మంచినీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ విజయ్‌కుమార్‌రెడ్డి, వీరన్న, హరీష్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement