రాష్ట్ర బడ్జెట్‌లో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఈసారి కొత్త పథకాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకు అవసరమైన నిధులు కేటాయింపులు చేసింది. ప్రధానంగా విద్యార్థుల కోసం అల్పాహారం పథకం అమలు చేయనుంది. 2026– 27 విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రీప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు బ్రేక్‌ఫాస్ట్ అందించనున్నారు. వారంలో మూడు రోజులపాటు పాలు, మూడు రోజులపాటు రాగిజావతో చేసిన నాణ్యమైన అల్పాహారం అందిస్తారు. అలాగే ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉదయం అల్పాహారంతోపాటు మధ్యాహ్నం భోజన సౌకర్యం కల్పిస్తారు. అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈ పథకం అమలుకానుంది. ఇంటర్మీడియట్ చదివే దివ్యాంగ విద్యార్థుల కోసం రెట్రోఫిట్టెడ్ మోటరైజ్డ్ టూ వీలర్ వాహనాలను పంపిణీ చేయనున్నారు. విదేశాల్లో చదివే విద్యార్థుల కోసం ఉపాధి, భాషా నైపుణ్యాల కోసం ప్రత్యేక పథకాన్ని అమలుచేయనున్నారు.
రెండో విడతలో ఇందిరమ్మ ఇళ్లు
ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ పథకాన్ని మరింత వేగంగా అమలు చేసేందుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించింది. ఇప్పటికే మొదటి విడత కింద ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను చేపట్టగా, రెండో విడతలోనూ కొత్త లబ్ధిదారులకు ఇళ్లను మంజూరు చేయనుంది.
వాతావరణం
ఆకాశం నిర్మానుష్యంగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండ తీవత్ర పెరుగుతుంది.
రాత్రివేళలో చల్లటి గాలులు వీస్తాయి.
కొడంగల్‌కు అధిక ప్రాధాన్యం..
ఈసారి రాష్ట్ర బడ్జెట్‌లో నారాయణపేట–కొడంగల్–మక్తల్ ఎత్తిపోతల పథకానికి అధిక ప్రాధాన్యం లభించింది. తొలుత రూ.4,350 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్‌ను రెండు విడతల్లో నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే మొదటి విడత కోసం రూ.1,126 కోట్లను కేటాయించగా.. రెండో విడత కింద మరోసారి రూ.2,945 కోట్లు మంజూరు చేశారు. ఈ ప్రాజెక్ట్‌ను పూర్తిచేసేందుకు తాజాగా రాష్ట్ర బడ్జెట్‌లో రూ.1,103.28 కోట్ల కేటాయింపులు దక్కాయి. ఈ ప్రాజెక్ట్ కింద పెండింగ్‌లో ఉన్న భూసేకరణతో పాటు పనులను వేగంగా పూర్తిచేసి సాగునీరు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
పెండింగ్‌లో ఉన్న వాటికి..
ఉమ్మడి జిల్లాలో దశాబ్దాల కాలంపాటు పెండింగ్‌లోనే ఉన్న సాగునీటి ప్రాజెక్ట్‌లకు ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం నిధులు కేటాయించింది. ప్రధానంగా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద కాల్వలు, డిస్ట్రిబ్యూటరీ కెనాళ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఈ పనుల కోసం రూ.800 కోట్లు కేటాయించింది. కోయిల్‌సాగర్ కోసం రూ.56.13 కోట్లు, సంగంబండ రూ.25.23 కోట్లు, ఆర్డీఎస్ రూ.88 కోట్లు, నెట్టెంపాడు ప్రాజెక్ట్‌కు రూ.232.50 కోట్లు, భీమా ఎత్తిపోతలకు రూ. 119.22 కోట్లు, జూరాల రిజర్వాయర్ గేట్ల మరమ్మతు, ఇతర పనుల కోసం రూ.3 కోట్లు కేటాయించింది.
–IIలో u
గతేడాది వేతనాలకు రూ.13 కోట్లు, ఈసారి రూ.20 కోట్లు
కొత్త ఇంజినీరింగ్, లా కళాశాలల ఏర్పాటు, సిబ్బందికి వేతనాలతో పెరిగిన బడ్జెట్
అభివృద్ధి పనుల కోసం రూ.25 కోట్లు కేటాయింపు
– మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్


