మంత్రి ఇంటి ఎదుట ఆశాల ధర్నా | - | Sakshi
Sakshi News home page

మంత్రి ఇంటి ఎదుట ఆశాల ధర్నా

Mar 21 2026 6:24 AM | Updated on Mar 21 2026 6:24 AM

మక్తల్‌: తమ సమస్యలు పరిష్కరించాలంటూ శుక్రవారం పట్టణంలోని రాష్ట్ర పశుసంవర్దకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి నివాసం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా ఆశా కార్యకర్తలు సంఘం అధ్యక్షురాలు సావిత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 28 వేల మంది ఆశా కార్యకర్తలు 20 ఏళ్లుగా పేద ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్నారని చెప్పారు. అధికారంలోకి రాగానే రూ.18 వేలు ఇస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌పార్టీ హామీ ఇచ్చిందని.. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో ప్రకటించాలని, ఇతర సమస్యల పరిష్కారానికి ఎన్‌ఎచ్‌ఎంకు సరిపడా నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. అలాగే రూ.50 లక్షల ఇన్సూరెన్స్‌, రూ.5 లక్షల రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ ఇవ్వాలని కోరారు. కుష్టు సర్వే, ఎన్నికలు, పరీక్షల విధులకు సంబంధించిన పెండింగ్‌ బిల్లులు చెల్లించాలన్నారు. అనంతరం మంత్రి పీఏ యాదయ్యకు వినతిపత్రం అందజేశారు. అంతకుముందు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు వెంకట్రాంరెడ్డి, బాల్‌రాం, రాజు, నిక్సన్‌, గోవిందరాజ్‌, నరహరి, గోవిందమ్మ, యశోద, ఇందిరమ్మ, సుజాత, లక్ష్మి, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement