రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేసింది. పేద ప్రజల కోసం ఇందిరమ్మ జీవిత బీమా పథకం ఏర్పాటు చేయడం శుభ పరిణామం. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలనేదే ప్రభుత్వ లక్ష్యం. – వాకిటి శ్రీహరి,
రాష్ట్ర పశుసంవర్దకశాఖ మంత్రి
ప్రజా.. ప్రగతి బడ్జెట్
సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభు త్వం సామాన్యుడి కలలను సాకారం చేసే ప్రజా ప్రగతి బడ్జెట్ ఇది. గత పాలకుల ఆడంబరాలకు భిన్నంగా, క్షేత్రస్థాయిలో ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా 6 గ్యారంటీల అమలుకు భారీగా నిధులు కేటాయించారు. ఇది అన్నివర్గాలకు అమోదయోగ్యమైన బడ్జెట్. – డా. చిట్టెం పర్ణికారెడ్డి,
ఎమ్మెల్యే, నారాయణపేట
అన్నివర్గాలకు సమ ప్రాధాన్యం..
మా ప్రభుత్వానిది జనరంజక బడ్జెట్. గతంలో ఏ ప్రభుత్వాలు చేపట్టని విధంగా అన్నివర్గాలకు సమ ప్రాధాన్యతనిచ్చింది. బడ్జెట్ కేటాయింపులతో ప్రజలు ఆనందంగా ఉన్నా రు. – ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు
సంక్షేమానికి నిధులు పెంచాల్సింది..
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భట్టి బడ్జెట్ నో గ్యారంటీలా ఉంది. ఆరు గ్యారంటీలు, ఎన్నికల మ్యానిఫెస్టోలోని 420 హామీల్లో పది శాతం అమలు చేయలేని పరిస్థితి. బడ్జెట్‌లో విద్య, వైద్యం, వ్యవసాయరంగాలతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి నిధులు పెంచాల్సి ఉండింది. ప్రజాసంక్షేమం, అభివృద్ధికి నోచుకోలేని బడ్జెట్ ఇది.
– ఎస్.రాజేందర్‌రెడ్డి, బీఆర్‌ఎస్
జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే
●


