పీయూకు జవసత్వాలు | - | Sakshi
Sakshi News home page

పీయూకు జవసత్వాలు

Mar 9 2026 7:22 AM | Updated on Mar 9 2026 7:22 AM

అంబులెన్స్‌ అందించిన ఎంపీ..

యూనివర్సిటీలో విద్యార్థులు అనారోగ్యానికి గురైతే ప్రాథమిక చికిత్స అందించేందుకు అధికారులు ప్రత్యేక పీహెచ్‌సీని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇక్కడ చిన్నపాటి ఆరోగ్య సమస్యలకు మాత్రమే చికిత్స ఇవ్వనున్నారు. అయితే విద్యార్థులకు అత్యవసర పరిస్థితి ఏర్పడితే ప్ర భుత్వ ఆస్పత్రి లేదా ఇతర ఆస్పత్రులకు తరలించేందుకు చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉండేంది. ఈ క్రమంలో పీయూ అధికారులు ఎంపీ డీకే అరుణను సంప్రదించగా ఆమె స్పందించి యూనివర్సిటీకి సుమారు రూ.10 లక్షల విలువైన అంబులెన్స్‌ను అందించారు. ప్రస్తుతం అది విద్యార్థులకు సేవలు అందిస్తుంది.

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: యూనివర్సిటీల అభివృద్ధికి నిధులు కేవలం ప్రభుత్వం నుంచే సంప్రదాయంగా వస్తున్న పద్ధతి ఉండేది. కానీ, పీయూలో ప్రభుత్వ నిధులతోపాటు ప్రైవేటు వ్యక్తుల నుంచి నిధులు సేకరించి యూనివర్సిటీని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. ఈ క్రమంలో యూనివర్సిటీ చరిత్రలోనే గతేడాది అత్యధికంగా విరాళాలు సాధించి రికార్డు సాధించారు. సుమారు రూ.10.20 కోట్ల నిధులు దాతల నుంచి రాబట్టడం విశేషం. అంతేకాకుండా భవిష్యత్‌లో మరిన్ని నిధులను ప్రైవేటు వ్యక్తులు, సంస్థల నుంచి (సీఆర్‌ఎఫ్‌) కార్పొరేట్‌ రెస్పాన్సిబిలిటీ ఫండ్‌ కింద నిధులు సేకరించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే కొన్ని ప్రైవేటు సంస్థలకు యూనివర్సిటీ అవసరాలు, విద్యార్థులకు వసతుల కల్పన కోసం నిధులు సేకరించేందుకు ప్రతిపాదనలు సైతం పంపించారు. ఈ క్రమంలోనే నిధులు ఇచ్చేందుకు కొన్ని సంస్థలు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తుంది. త్వరలో మరిన్ని నిధులు యూనివర్సిటీ వచ్చే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.

ఆడిటోరియం నిర్మాణంతో..

పీయూలో విద్యార్థులు పెద్దఎత్తున కార్యక్రమాలు, సమావేశాలు నిర్వహించేందుకు ఆడిటోరియం ఇప్పటి వరకు లేవు. కేవలం రెండు సెమినార్‌ హాల్స్‌ మాత్రమే ఉండగా.. ఇందులో ఒకటి ఫార్మీసీ కళాశాల సెమినార్‌ హాల్‌, లైబ్రరీ ఆడిటోరియం. ఇక్కడ కూడా సీటింగ్‌ కెపాసిటీ చాలా తక్కువగా ఉండడంతో ఇబ్బందులు ఎదురయ్యేవి. ఈ నేపథ్యంలో పీయూలో ఆడిటోరియం నిర్మాణం కోసం రూ.10 కోట్లు ఇవ్వనున్నట్లు ఎంఎస్‌ఎన్‌ కంపెనీ అధినేత ఎంఎస్‌ఎన్‌ రెడ్డి ప్రకటించారు. వీటికి సంబంధించిన ప్రక్రియ సైతం ప్రారంభించినట్లు లేఖలను కూడా పీయూ వీసీకి అందించారు. దీంతో ఆడిటోరియం నిర్మాణం కోసం ఎంఈడీ కళాశాల ఆవరణలో భూమిని సైతం కేటాయించారు. త్వరలో భూమిపూజ చేసే అవకాశం ఉండగా.. సుమారు వెయ్యికిపైగా సీటింగ్‌ కెపాసిటీతో నిర్మించనున్నారు. అలాగే యూనివర్సిటీ అవసరాలతోపాటు బయటి వారికి సైతం అద్దె ప్రాతిపదికన ఇవ్వనున్నారు.

మరిన్ని నిధులు రాబడతాం..

ఏడాది కాలంలో యూనివర్సిటీ చరిత్రలో ఎప్పుడూ లేనన్ని నిధులను ప్రైవేటు వ్యక్తుల నుంచి సేకరించాం. యూనివర్సిటీలో ఆడిటోరియం నిర్మాణానికి ఎంఎస్‌ఎన్‌ రెడ్డి రూ.10 కోట్లు ఇవ్వనున్నారు. వీటితోపాటు పీయూ హాస్టల్స్‌లో చపాతి చేసేందుకు ఎస్‌బీఐ నుంచి రెండు రోటీ మేకర్‌ మిషన్‌ తీసుకువచ్చాం. విద్యార్థుల అవసరాల కోసం మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ అంబులెన్స్‌ కూడా అందజేశారు. అలాగే ఇతర అవసరాల కోసం పలు ప్రైవేటు సంస్థలకు ప్రతిపాదనలు పంపించాం. త్వరలో మరిన్ని నిధులు రానున్నాయి. వీటితో విద్యార్థులకు మరిన్ని మౌలిక వసతులు కల్పించి.. నాణ్యమైన విద్య అందించేలా కృషిచేస్తాం.

– జీఎన్‌ శ్రీనివాస్‌,

వైస్‌ చాన్స్‌లర్‌, పీయూ

ప్రభుత్వంపైనే ఆధారపడకుండా వినూత్న పంథాలో నిధుల సమీకరణ

దాతల నుంచి గతేడాది

సుమారు రూ.10.20 కోట్ల విరాళాలు

హాస్టల్స్‌కు రెండు రోటీ మేకర్స్‌

ఇచ్చిన ఎస్‌బీఐ

విద్యార్థులు ఆస్పత్రికి వెళ్లేందుకు అంబులెన్స్‌ సమకూర్చిన ఎంపీ డీకే అరుణ

విద్యార్థుల శిక్షణ, ఇతర వసతుల కల్పన కోసం పలు సంస్థలకు విజ్ఞప్తులు

రోటీ మేకర్స్‌తో తీరిన ఇబ్బంది..

పీయూ బాలికల హాస్టల్స్‌లో ఇటీవల కొత్త హాస్టల్స్‌ ప్రారంభంతోపాటు ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థులు చేరారు. దీంతో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఉదయం టిఫిన్‌ కోసం చపాతీలు చేయడం పెద్ద సమస్యగా మారింది. ఇందులో సుమారు 750 మందికిపైగా ఉండగా ఒక్కొక్కిరికి సుమారు నాలుగు చపాతీలు ఇచ్చినా ఒక్కరోజు సుమారు 4 వేల చపాతీలు చేయాల్సి వస్తుంది. దీంతో సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉండటంతో ఎస్‌బీఐ గణేష్‌నగర్‌ బ్రాంచ్‌ యూనివర్సిటీ అధికారులు రోటీ మేకర్స్‌ ఇవ్వాలని ప్రతిపాదనలు పెట్టారు. దీంతో స్పందించిన ఎస్‌బీఐ అధికారులు పీయూ హాస్టల్స్‌కు రూ.10 లక్షల విలువైన రెండు రోటీ మేకర్స్‌ను అందించారు. ఇవి ప్రస్తుతం బాలికల హాస్టల్స్‌లో అందుబాటులోకి వచ్చాయి. వీటి అవసరం రెండు బాలుర హాస్టల్స్‌లో కూడా ఉండడంతో అక్కడ కూడా ఏర్పాటు చేయాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement