తాతల కాలం నుంచే.. | - | Sakshi
Sakshi News home page

తాతల కాలం నుంచే..

Mar 9 2026 7:22 AM | Updated on Mar 9 2026 7:22 AM

తాతల కాలం నుంచే.. మన్నికకు మారు పేరు.. చొక్క బంగారం తయారుచేస్తాం త్వరలోనే జీఐ వస్తోంది..

మాతాత మహ్మద్‌ హస న్‌ సహాబ్‌ చాంద్‌ 1955 లో బంగారం నగల వ్యాపారం ప్రారంభించారు. అప్పటి నుంచి నేటి వరకు ఆ వ్యాపారాన్ని మార్కెట్‌లో పోటీపడుతూ మేము కొనసాగిస్తున్నాం. జనానికి నాణ్యమైన బంగారు నగలు విక్రయిస్తాం. అందుకే నారాయణపేట్‌ సోనేకా థేట్‌ అని పేరు వచ్చింది.

– తఖీ చాంద్‌, బంగారం వ్యాపారి,

నారాయణపేట

నారాయణపేట బంగారం అంటేనే మన్నికకు మారుపేరు. 24 క్యారెట్ల ఆభరణాల విక్రయాలు జరుగుతాయి. హైదరాబాద్‌, రంగారెడ్డి, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి బంగారం కొనుగోలు చేస్తుంటారు. ఇక్కడ బంగారం కొంటే రీసె ల్‌ 99.12 శాతం ఉంటుంది. అందుకే నారాయణపేట బంగారం అంటే ఇష్టపడతారు.

– హరినారాయణ భట్టడ్‌, బులియన్‌ మర్చంట్‌ అసోసియేషన్‌ పట్టణ అధ్యక్షుడు

బంగారు ఆభరణాల తయారీ చొక్కంగా ఉంటుంది. నగల్లో ఎలాంటి కల్తీ ఉండదు. పుస్తెలు, వంకి, ఉంగరాలు, నల్లపూసల దండలు, వడ్డానాలు, నానులు తదితర వాటిని నాణ్యత, మన్నికతో కూడిన విధంగా తయారుచేస్తాం. జాయింట్ల కోసమే కేడీఎం వాడుతాం. మేము తయారుచేసే నగలు వంద శాతం నాణ్యతగా ఉంటాయి.

– గాయత్రి, స్వర్ణకారురాలు,

నారాయణపేట

నారాయణపేట గోల్డ్‌ ప్యూరిటీతో 24 క్యారెట్ల బంగారంతో మోడ్రన్‌ డిజైన్లు తయారుచేసి విక్రయిస్తున్నాం. 130 ఏళ్ల చరిత్ర ఉన్న నారాయణపేట బంగారానికి జీఐ గుర్తింపు కోసం దరఖాస్తు చేశాం. బంగారాన్ని సేవింగ్స్‌గా భావిస్తాం. కొన్న బంగారాన్ని అమ్మితే 98 శాతం రిటర్న్‌ డబ్బులు వస్తాయి. 150 జ్యువెల్లర్స్‌, 270 మంది స్వర్ణకారులతో మరో 1,700 మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో తయారుచేసే నగలు 24 క్యారెట్‌లతో తయారు చేయడం సాధ్యం కాదని చెబుతున్నారు. కానీ నారాయణపేటలో అది సాధ్యమని నిరూపిస్తున్నాం. అందుకే జీఐ గుర్తింపు వస్తుందని నమ్మకం ఉంది.

– సాకేత్‌ భట్టడ్‌, బులియన్‌ మర్చంట్‌ అసోసియేషన్‌ చీఫ్‌ కోఆర్డినేటర్‌,

నారాయణపేట

Advertisement
 
Advertisement
Advertisement