
ఉత్సాహంగా చదరంగం పోటీలు
నారాయణపేట రూరల్: జిల్లా కేంద్రంలో గురువా రం నిర్వహించిన చెస్ పోటీలు విజయవంతం అయ్యాయి. 69వ ఎస్‌జీఎఫ్ క్రీడల్లో భాగంగా జిల్లా స్థాయి అండర్ –14, అండర్ –17 బాలబాలికల చదరంగ పోటీలు పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల కు చెందిన 120మంది విద్యార్థులు పాల్గొన్నారు. పోటాపోటీగా ఎత్తులకు పైఎత్తులు వేస్తూ పలువు రు విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చరు. అండర్ –14 బాలికల విభాగం నుంచి ఐదుగురు, బాలుర విభాగం నుంచి ఐదుగురు, అండర్– 17 లో బాలికలు, బాలుర నుంచి ఐదుగురు చొప్పున ఎంపికయ్యారు. వీరు ఈనెల 18న వనపర్తిలో జరిగే ఉమ్మ డి మహబూబ్‌నగర్ స్థాయి పోటీలో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ఎస్ జి ఎఫ్ మాజీ సెక్రెటరీ నర్సిములు, పిడిలు రత్నయ్య, కథలప్ప, బాలరాజ్, వెంకటేష్, రామకృష్ణరెడ్డి, అక్త ర్, పర్వీన్, అనంత సేన, కృష్ణవేణి పిఈటిలు బసంత్ రెడ్డి, రాజేష్, చక్రి, మోహన్ పాల్గొన్నారు.