
యూరియా కోసం తప్పని పాట్లు
ధన్వాడ/మద్దూరు: జిల్లాలో రైతులకు యూరియా కష్టాలు తొలగడం లేదు. ఎరువుల పంపిణీ కేంద్రాల వద్ద ఎదురుచూపులు తప్పడం లేదు. ధన్వాడ సింగిల్‌విండోకు ఆదివారం రాత్రి 350 బస్తాల యూరియా వచ్చిన విషయం తెలుసుకున్న రైతులు.. సోమవారం తెల్లవారుజామునే అక్కడికి చేరుకొని చెప్పులు, రాళ్లను క్యూలో పెట్టారు. చివరకు చాలా మంది రైతులకు యూరియా అందకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. ఎలాగైనా యూరియా తీసుకోవాలని తమ భార్యాపిల్లలతో కలిసి క్యూలో ఉంటున్నామని రైతులు వాపోయారు.
● మద్దూరులోని పీఏసీఎస్ వద్ద రైతులు యూరియా కోసం నానా అవస్థలు పడ్డారు. తెల్లవారుజామునే పీఏసీఎస్‌కు చేరుకొని పట్టాదారు పాస్‌పుస్తకాలను వరుస క్రమంలో పెట్టి, యూరియా కోసం పడిగాపులు కాశారు. 600 బస్తాల యూరియా పీఏసీఎస్‌కు రావడంతో పోలీసుల బందోబస్తు మధ్య ఒక్కో రైతుకు రెండు బస్తాల చొప్పున పంపిణీ చేశారు.