తమ్ముడిని మిస్‌ అవుతున్నా.. | - | Sakshi
Sakshi News home page

తమ్ముడిని మిస్‌ అవుతున్నా..

Aug 19 2024 1:44 AM | Updated on Aug 19 2024 1:34 PM

-

మహబూబ్‌నగర్‌కు చెందిన ఆర్‌.రాంకోటి, ప్రభావతికు ఇద్దరు ఆడపిల్లలు, ఒక కుమారుడు. వీరిలో పెద్దమ్మాయి సౌమ్య పెళ్లి అనంతరం గత నాలుగేళ్ల నుంచి అమెరికాలో ఉంటున్నారు. మూడేళ్లు చికాగోలో ఉండగా ఏడాది నుంచి డల్లాస్‌లో ఉంటున్నారు. చెల్లి, తమ్ముడితో కలిసి ప్రతి రాఖీ పండుగను ఎంతో ఆనందంగా జరుపుకొనేవారు. గతేడాది ఇక్కడికే వచ్చిన ఆమె తమ్ముడికి స్వయంగా రాఖీ కట్టింది. ఈ ఏడాది అమెరికాలో ఉండడంతో తన తమ్ముడు వినయ్‌కుమార్‌కు డల్లాస్‌ నుంచి కొరియర్‌ ద్వారా తమ్ముడికి రాఖీ పంపించింది. దీంతో వినయ్‌కుమార్‌ అక్క సౌమ్య పంపిన రాఖీతోపాటు మరో సోదరి విష్ణుప్రియతో రాఖీ కట్టించుకుంటానని పేర్కొన్నాడు.

తమ్ముడిని మిస్‌ అవుతున్నా.. 
చిన్నప్పటి నుంచి రాఖీ పండుగ అంటే ఎంతో ఇష్టం. ప్రస్తుతం డల్లాస్‌లో ఉండడం వల్ల తమ్ముడిని రాఖీ కట్టలేకపోతున్న. గతేడాది రాఖీ పండుగ రోజు అక్కడే ఉండడం వల్ల తమ్ముడికి రాఖీ కట్టాను. ఈ ఏడాది రాఖీ పండుగ రోజు తమ్ముడిని ఎంతో మిస్‌ అవుతున్నా. నేను పంపే రాఖీ తమ్ముడికి అందాలనే ఉద్దేశంతో మూడేళ్ల నుంచి కొరియర్‌ ద్వారా పంపుతున్న. ఆ రోజు వీడియో కాల్‌లో తమ్ముడికి రాఖీ పండుగ శుభాకాంక్షలు చెబుతాను.        
 – సౌమ్య, ఎన్‌ఆర్‌ఐ (డల్లాస్‌)  

Advertisement
 
Advertisement
Advertisement