స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం మనదే | - | Sakshi
Sakshi News home page

స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం మనదే

Oct 12 2026 8:10 AM | Updated on Oct 12 2026 8:10 AM

● పోరాడదాం.. గెలిచి సత్తా చాటుదాం!

● కూటమి చేతిలో మోసపోయిన ప్రజలు

వాస్తవాలు తెలుసుకుంటున్నారు

● మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి

సమావేశానికి హాజరైన పార్టీ కార్యకర్తలు

మాట్లాడుతున్న మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి

డోన్‌: కూటమి ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీదే విజయ మని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి స్పష్టం చేశారు. డోన్‌ పట్టణంలోని ఎం కన్వెషన్‌ హాల్‌లో ఆదివారం ఇటీవల పదవీ విరమణ చేసిన జెడ్పీ చైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి, డోన్‌ ఎంపీపీ, జెడ్పీటీసీలు రేగటి రాజశేఖర్‌రెడ్డి, బద్దల రాజ్‌కుమార్‌, వైస్‌ ఎంపీపీ ఎర్రిస్వామిలతో పాటు ఎంపీటీసీ, సర్పంచ్‌లకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. పార్టీ పట్టణ అధ్యక్షులు మల్లికార్జునరెడ్డి ఆధ్వర్యంలో 40 మంది మాజీ ప్రజా ప్రతినిధులను మాజీ మంత్రి బుగ్గన ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బుగ్గన మాట్లాడుతూ.. గత మూడేళ్లుగా టీడీపీ ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులను అనేక రకాలుగా వేధిస్తూ అక్రమ కేసులు బనాయించి జైలుపాలు చేసిన విషయాన్ని మాజీ మంత్రి గుర్తు చేశారు. ఎంత నిర్బంఽధించినా.. అక్రమ కేసులు బనాయించినా ఏ ఒక కార్యకర్త కూడా వెన్ను చూపలేదన్నారు. తమ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కోసం ఎంతటి త్యాగాలకైనా వెనుకాడమ న్నారు. టీడీపీ అవినీతి, అరచకాలకు వ్యతిరేకంగా ఎదురొడ్డి పోరాడే సత్తా వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలకు ఉందన్నారు. అంకిత భావం, పట్టుదలతో పని చేసి టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించగలిగితే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అఖండ విజయం సాధిస్తామన్నారు.

అనితర సాధ్యులు బుగ్గన..

గత ప్రభుత్వ ఐదేళ్ల పరిపాలన కాలంలో రెండేళ్లు కాలం కరోనాతో కరిగిపోగా మిగిలిన మూడేళ్లలో రూ.4 వేల కోట్లతో డోన్‌ మోడల్‌ నియోజకవర్గంగా అప్పటి సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి సహకారంతో తీర్చిదిద్దిన ఘనత మాజీ మంత్రి బుగ్గనకే దక్కుతుందని జిల్లా పరిషత్‌ మాజీ చైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి అన్నారు. డోన్‌ నియోజకవర్గ విషయంలో బుగ్గన అనితర సాధ్యుడని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. సమావేశంలో పార్టీ వ్యవసాయ విభాగం రాష్ట్ర కార్యదర్శి మెట్టు వెంకటేశ్వరరెడ్డి, మార్కెట్‌ యార్డ్‌ మాజీ చైర్మెన్‌ మల్లెంపల్లె రామచంద్రుడు, మున్సిపల్‌ మాజీ చైర్మెన్‌ సప్తశైల రాజేష్‌, సింగిల్‌ విండో మాజీ చైర్మన్‌ తిరునాం పల్లె తిరుమల్‌రెడ్డి, పార్టీ సినీయర్‌ నాయకులు చిన్న పూజర్ల రామచంద్రరెడ్డి, నాగభూషణంరెడ్డి, మల్యాల భాస్కర్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, పోస్ట్‌ ప్రసాద్‌, చిరంజీవి, దినేష్‌ గౌడ్‌,పార్టీ డోన్‌, ప్యాపిలి మండలాల అధ్యక్షులు సోమేష్‌ యాదవ్‌, కృష్ణమూర్తి పాల్గొన్నారు.

బాబు హామీలన్నీ బూటకమని ప్రజలకు అర్థమైంది

ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ బూటకమని, నీటి మీద రాతలని ప్రజలు అర్థం చేసుకున్నారన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని పోలీసులతో భయబ్రాంతులకు గురి చేయించి స్థానిక సంస్థ ఎన్నికల్లో గెలుపొందాలని టీడీపీ నేతలు కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్న విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ టీడీపీ నాయకుల కుయిక్తులను తిప్పికొట్టే సత్తా తమకుందన్నారు. రెట్టించిన ఉత్సాహంతో ప్రతి కార్యకర్త వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలన్నా రు. పార్టీ కోసం నిరంతరం పాటుపడే నాయకులు, కార్యకర్తలకు భవిష్యత్తులో మంచి గుర్తుంపు ఉంటుందని బుగ్గన హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement