నేడు కలెక్టరేట్‌లో ప్రజా వినతుల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

నేడు కలెక్టరేట్‌లో ప్రజా వినతుల స్వీకరణ

Oct 12 2026 8:10 AM | Updated on Oct 12 2026 8:10 AM

నంద్యాల(న్యూటౌన్‌): స్థానిక కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ హాలులో ఈనెల 12వ తేదీ సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమవుతుందన్నారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకోవడం కోసం టోల్‌ ఫ్రీ నంబర్‌ 1100ను సంప్రదించవచ్చన్నారు. అలాగే అర్జీదారులు దరఖాస్తుల ప్రస్తుత సమాచారాన్ని meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో సంప్రదించి తెలుసుకోవచ్చన్నారు. అర్జీలను కూడా ఇలాగే నమోదు చేసుకోవచ్చన్నారు. అర్జీదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. జిల్లా కేంద్రంలో జరిగే ఈ కార్యక్రమానికి సంబంధిత శాఖల జిల్లా స్థాయి అధికారులందరూ తప్పనిసరిగా హాజరై ప్రజల వినతులు స్వీకరించారు.

నేటి నుంచి దసరా సెలవులు

నంద్యాల(న్యూటౌన్‌): జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేట్‌, కార్పొరేట్‌ ఇతర యాజమాన్యాల పాఠశాలలకు ఈ నెల 12 నుంచి 21 వ తేదీ వరకు దసరా సెలవులను ప్రభుత్వం ప్రకటించినట్లు డీఈఓ జనార్దన్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సెలవుల్లో ఎవరైనా ప్రత్యేక తరగతులు, పరీక్షలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. నిరంతర చదువుల ఒత్తిడి నుంచి విద్యార్థులకు ఉపశమనం కల్పించి పండుగ సెలవుల్లో మానసిక ఉల్లాసాన్ని అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం దసరా సెలవులను ప్రకటించిందన్నారు. జిల్లాలోని ఎంఈఓలు, ఉప విద్యాశాఖ అధికారులు, తమ పరిధిలోని పాఠశాలలపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలన్నారు.

అన్నదాన పథకానికి రూ.5 లక్షల విరాళాలు

శ్రీశైలంటెంపుల్‌: శ్రీశైల దేవస్థానం భక్తుల సౌకర్యార్తం నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణ పథకానికి పలువురు భక్తులు రూ.5 లక్షల విరాళాలను అందించారు. ఆదివారం హైదరాబాద్‌కు చెందిన యల్లా శ్రీనివాస శేషసాయిబాబు రూ.4 లక్షల విరాళాన్ని సహయ కార్యనిర్వహణాధికారి ఎం.హరియనాయక్‌కు అందజేశారు. అలాగే రంగారెడ్డికి చెందిన పి.జగన్‌మోహన్‌రావు రూ.1,00,001 విరాళాన్ని పర్యవేక్షకులు గంజి రవికి అందజేశారు. విరాళాలను అందించిన దాతలకు దేవస్థానం తరుపున స్వామివారి శేషవస్త్రాలను, లడ్డూప్రసాదాలను అందించి సత్కరించారు.

వీబీఆర్‌కు నిలిచిన ఇన్‌ఫ్లో

వెలుగోడు: వెలుగోడు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌కు ఇన్‌ఫ్లో నిలిచిపోయింది. ఆదివారం ఉదయం 6 గంటల సమయానికి 8.373 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. రిజర్వాయర్‌ పూర్తి నీటిమట్టం 264.70 మీటర్లు కాగా, ప్రస్తుతం 258.81 మీటర్ల నీటిమట్టం నమోదైంది. రిజర్వాయర్‌ పూర్తి నిల్వ సామర్థ్యం 16.95 టీఎంసీలు. ప్రస్తుతం ఇన్‌ఫ్లో లేకపోగా, అవుట్‌ఫ్లో 500 క్యూసెక్కులుగా నమోదైంది. తెలుగు గంగ ప్రధాన కాలువకు 150 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. వెలుగోడు, ఆత్మకూరు, నంద్యాల పట్టణాల తాగునీటి అవసరాల కోసం 20 క్యూసెక్కులు సరఫరా చేస్తున్నారు. ఎడమ, కుడి కాలువలకు చెరో 10 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎస్‌ఎల్‌ఐఎస్‌ పంపింగ్‌ ద్వారా 100 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు. రిజర్వాయర్‌ నుంచి ప్రస్తుతం స్పిల్‌వే ద్వారా ఎలాంటి మిగులు నీటి విడుదల లేదు.

నేడు డయల్‌ యువర్‌

సీఎండీ, ఎస్‌ఈ

కర్నూలు(అగ్రికల్చర్‌): డయల్‌ యువర్‌ ఏపీఎస్‌పీడీసీఎల్‌ సీఎండీ కార్యక్రమాన్ని సోమ వారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు కర్నూ లు సర్కిల్‌ ఎస్‌ఈ ఆర్‌.ప్రదీప్‌కుమార్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు 8977716661 నంబరుకు ఫోన్‌ చేయవచ్చని పేర్కొన్నారు. కర్నూలు కొత్తబస్టాండు సమీపంలోని విద్యుత్‌ భవన్‌లో డయల్‌ యువర్‌ ఎస్‌ఈ కార్యక్రమం సో మవారం జరుగుతుందని ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement