వైఎస్సార్‌సీపీ గెలుపే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ గెలుపే లక్ష్యం

Oct 12 2026 8:10 AM | Updated on Oct 12 2026 8:10 AM

కల్లూరు: స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ నేతలు, నాయకులు కృషి చేయా లని పార్టీ కర్నూలు, నంద్యాల జిల్లాల రీజినల్‌ కోఆర్డినేటర్‌ భూమన కరుణాకర్‌రెడ్డి సూచించారు. ఆదివారం కల్లూరులోని వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి నివాసంలో నంద్యాల జిల్లా నేతలతో భూమన కరుణాకర్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు నియోజకవర్గాల సమన్వయకర్తలు, నేతలు, నాయకులు సిద్ధంగా ఉండాలన్నారు. ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ చల్లా మధుసూదన్‌రెడ్డి, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, నంద్యాల మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్‌ బాషా, మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రామిరెడ్డి, శిల్ప చక్రపాణిరెడ్డి, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌ ధారా సుధీర్‌, పార్టీ యువజన విభాగం ఉపాధ్యక్షుడు కాటసాని శివనరసింహారెడ్డి, నగర మాజీ మేయర్‌ బీవై రామయ్య, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement