సేవలకు తెరచుకోని తలుపులు | - | Sakshi
Sakshi News home page

సేవలకు తెరచుకోని తలుపులు

May 2 2026 7:26 AM | Updated on May 2 2026 7:26 AM

ల్లె ప్రజలకు ఇంటి వద్దనే సేవలందించే గ్రామ సచివాలయాల పేర్లను రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణగ్రామ అని మార్చింది కానీ వాటి ప్రారంభాన్ని మరచిపోయింది. పగిడ్యాల మండలంలో పది గ్రామ సచివాలయాలు ఉండగా కేవలం పగిడ్యాల 1, 2, లక్ష్మాపురం 1 భవనాలు మాత్రమే ప్రారంభం అయ్యాయి. నెహ్రూనగర్‌ 2, పాత, కొత్త ముచ్చుమర్రి, సంకిరేణిపల్లె, లక్ష్మాపురం 2 గ్రామ సచివాలయ భవనాలు నిర్మాణాలను పూర్తి చేసుకుని రెండేళ్లు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించడం లేదు. సేవలు అందక ప్రజలు, కార్యాలయం అందుబాటులో రాక సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు.

–పగిడ్యాల

Advertisement
 
Advertisement
Advertisement