కార్మికుల పక్షాన వైఎస్సార్‌సీపీ పోరాటం | - | Sakshi
Sakshi News home page

కార్మికుల పక్షాన వైఎస్సార్‌సీపీ పోరాటం

May 2 2026 7:26 AM | Updated on May 2 2026 7:26 AM

వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌ రెడ్డి

కర్నూలు: కార్మికుల సంక్షేమం కోసం వైఎస్సార్‌సీపీ పోరాడుతుందని ఆ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి అన్నారు. కర్నూలు అర్బన్‌ ముజఫర్‌ నగర్‌లో ఉన్న ఏపీఎస్‌బీసీఎల్‌ లిక్కర్‌ గోడౌన్‌ వద్ద హమాలీ కార్మికులు మేడే దినోత్సవాన్ని పురస్కరించుకుని వేడుకలు జరిపారు. వైఎస్సార్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు భీమేశ్వర్‌ రెడ్డి, శివశంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన మే డే వేడుకలకు కాటసాని రాంభూపాల్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు మే డే కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం లక్ష్మీపురం గ్రామం పరిధిలో భారత్‌ గ్యాస్‌ డ్రైవర్స్‌ అండ్‌ హమాలీస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కూడా కాటసాని హాజరై వైఎస్సార్‌ ట్రేడ్‌ యూనియన్‌ జెండాను ఆవిష్కరించారు. 28వ వార్డు మాజీ కార్పొరేటర్‌ నారాయణరెడ్డి, నాయకులు అయ్యప్ప, పాలకొలను రమేష్‌, ఏపీఎస్‌బీసీఎల్‌ హమాలీ యూనియన్‌ కార్మికులు మల్లికార్జున, వలి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement