వైభవం.. పీఠాధిపతి పట్టాభిషేకం | - | Sakshi
Sakshi News home page

వైభవం.. పీఠాధిపతి పట్టాభిషేకం

May 2 2026 7:26 AM | Updated on May 2 2026 7:26 AM

మంత్రాలయం: శ్రీరాఘవేంద్రస్వామి పీఠాధిపతి సుబుధేంద్రతీర్థుల 14వ పట్టాభిషేక మహోత్సాలు వైభవంగా నిర్వహించారు. తొలుత ఊంజల మండపంలో యజ్ఞ యాగాలు చేపట్టారు. శ్రీమఠం ప్రాంగణంలో బ్రహ్మర్చిత శ్రీమూలరామదేవర పూజ, అదే విధంగా షోడశా బాహు శ్రీనరసింహా పూజను పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు నిర్వహించారు. గ్రామదేవత మంచాలమ్మ, రాఘవేంద్రస్వాములకు విశేష పూజలు చేపట్టి మహా మంగళహారతులు ఇచ్చారు. పరమ పావన శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థుల అభినందన కార్యక్రమం శ్రీమఠం మేనేజర్‌, సిబ్బంది, శిష్యబృందం, భక్తులతో, మంత్రాలయం నివాసులు ఘనంగా చేపట్టారు. అనంతరం శ్రీమఠం పీఠాధిపతిని గజమాలతో, పూలతో శ్రీమఠం అధికారులు సన్మానించారు. మేనేజర్‌ ఎస్‌కె.శ్రీనివాసరావు రచించిన పుస్తకావిష్కరణ జరిగింది. అనంతరం భక్తులు పీఠాధిపతికి తులభారం నిర్వహించారు.కార్యక్రమంలో మేనేజర్‌–2 వెంకటేష్‌జోషి, శ్రీమఠం ఇంజినీర్‌ సురేష్‌ కోనాపూర్‌, శ్రీమఠం సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement