ఉమ్మడి జిల్లాకు 21 నూతన కోర్టులు | - | Sakshi
Sakshi News home page

ఉమ్మడి జిల్లాకు 21 నూతన కోర్టులు

Apr 7 2026 8:13 AM | Updated on Apr 7 2026 8:13 AM

కర్నూలు: ఉమ్మడి కర్నూలు జిల్లాలో 21 నూతన కోర్టులను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం జీవో జారీ చేసింది. కర్నూలుకు అదనంగా ఐదు నూత న కోర్టులు, నంద్యాలలో నాలుగు నూతన కోర్టులు మంజూరయ్యాయి. కర్నూలులో 8వ అదనపు జిల్లా కోర్టు, 5వ అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులు, నంద్యాలలో 9వ అదనపు జిల్లా కోర్టుతో పాటు మూడు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులు, ఆదోనిలో మొదటి అదనపు సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టుతో పాటు ఒక జేసీజే కోర్టు మంజూరైంది. ఆళ్లగడ్డ, ఆలూరు, ఆత్మకూరు, బనగానపల్లె, డోన్‌, నందికొట్కూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు, శ్రీశైలంలో ఒక్కొక్క జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులు మంజూరయ్యాయి. ఆయా కోర్టులకు అవసరమైన న్యాయమూర్తులు, సిబ్బందిని కూడా ప్రభుత్వం మంజూరు చేసింది. ఎమ్మిగనూరుకు నూతనంగా సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు మంజూరైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement