● మూడు గంటల వ్యవధిలోనే
గూళ్యంలో దంపతుల మృతి
హాలహర్వి: తోడునీడగా నిలిచిన దంపతులు మరణంలోనూ ఒకరిని విడిచి మరొకరు ఉండలేకపోయారు. కొన్ని గంటల వ్యవధిలోనే తనువు చాలించారు. గూళ్యం గ్రామంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు యమునాసాబ్ తల్లిదండ్రులైన పింజరి ఉలిశేఖన్న(73), ఆయన భార్య ఉలి శేఖమ్మ(70) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఉలి శేఖన్న మృతి చెందారు. ఈ విషయం తెలిసి తీవ్రంగా కలత చెందిన ఉలి శేఖమ్మ అదేరోజు సాయంత్రం 6 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. మూడు గంటల వ్యవధిలోనే భార్యాభర్తలిద్దరూ మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వీరికి నలుగురు సంతానం.


