ముగిసిన ఇంటర్‌ మూల్యాంకనం | - | Sakshi
Sakshi News home page

ముగిసిన ఇంటర్‌ మూల్యాంకనం

Apr 8 2026 7:38 AM | Updated on Apr 8 2026 7:38 AM

జిల్లాలో 1.93 లక్షల జవాబు పత్రాల వాల్యూయేషన్‌

స్పాట్‌ సెంటర్‌లోనే మార్కుల పోస్టింగ్‌

ఈనెల 15న ఇంటర్‌ పలితాలు వెలువడే అవకాశం

నంద్యాల(న్యూటౌన్‌): ఇంటర్మీడియెట్‌ బోర్డు ఆధ్వర్యంలో జవాబు పత్రాల మూల్యాంకనం మంగళవారం ముగిసింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌కు చెందిన 1,93,831 జవాబు పత్రాలను 29 రోజుల పాటు నిరంతరాయంగా మూల్యాంకనం చేశారు. స్పాట్‌ వాల్యుయేషన్‌ క్యాంప్‌ ఆఫీసర్‌గా ఇంటర్మీడియెట్‌ జిల్లా విద్యాశాకాధికారి శంకర్‌నాయక్‌ వ్యవహరించారు. సాధారణంగా ఇప్పటి వరకు మూల్యాంకనం అనంతరం ఓఎంఆర్‌ షీట్‌లోని పార్ట్‌–3 (మార్కులు నమోదు చేసిన షీట్‌)ను విడదీసి బండిళ్లు ఇంటర్మీడియెట్‌ బోర్డుకు పంపించే వారు. అక్కడ బోర్డు అధికారుల పర్యవేక్షణలో ఓఎంఆర్‌ షీట్‌ పార్ట్‌–3లో మార్కులను స్కాన్‌ చేసి, మార్కుల నమోదు అనంతరం ఫలితాలను ప్రకటించే వారు. ఈ ప్రక్రియలో ఉన్న జాప్యాన్ని తగ్గించేందుకు ఇంటర్‌ బోర్డు అధికారులు గత ఏడాది తొలిసారిగా ప్రతి స్పాట్‌ కేంద్రానికి స్కానర్‌ను అందజేశారు. స్కానింగ్‌ అనంతరం మరొకసారి మార్కు ల నమోదును నిర్ధారించడం వలన విద్యార్థికి నష్టం కలగదు. స్కానర్‌ ద్వారా ‘స్పాట్‌’ కేంద్రంలో మూ ల్యాంకనం చేసిన అనంతరం మార్కుల నమోదు చేపట్టారు. స్పాట్‌ ముగియడంతో అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రుల దృష్టి ఫలితాలపై పడింది. ఈ నెల 15న ఇంటర్‌ ఫలితాలు వచ్చే అవకాశముందని అధికారుల ద్వారా తెలుస్తోంది. ఇంటర్మీడియెట్‌ బోర్డు జిల్లా విద్యాశాఖాధికారి శంకర్‌నా యక్‌ నేతృత్వంలో మూల్యాంకన ప్రక్రియ సజావుగా సాగింది. 690 మంది అసిస్టెంట్‌ ఎగ్జామినర్లు పేపర్లను మూల్యాంకనం చేయగా, 111 మంది స్క్రూటినైజర్లు తనిఖీ చేశారు. మూల్యాంకన ప్రక్రియలో 83 మంది చీఫ్‌ ఎగ్జామినర్స్‌, 18 మంది అసిస్టెంట్‌ క్యాంప్‌ ఆఫీసర్స్‌, జెన్‌1, జెన్‌2, ఇద్దరు చీఫ్‌ కోడింగ్‌ ఆఫీసర్స్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement