కేంద్ర నిధుల వినియోగంపై విచారణ | - | Sakshi
Sakshi News home page

కేంద్ర నిధుల వినియోగంపై విచారణ

Apr 8 2026 7:38 AM | Updated on Apr 8 2026 7:38 AM

భూగర్భజలాల పెంపునకు చర్యలు తీసుకోండి

సంప్రదాయబద్ధంగా శ్రీశైల భ్రమరాంబాదేవికి కుంభోత్సవం

గుమ్మడి, కొబ్బరి, నిమ్మకాయలతోసాత్వికబలి

సీ్త్ర వేషధారణలో పురుషుడు అమ్మవారికి కుంభహారతి

నిజరూపంలో దర్శనమిచ్చిన

భ్రమరాంబాదేవి

రుద్రవరం: మండల కేంద్రమైన రుద్రవరం, కొండమాయపల్లె గ్రామాల్లో మంగళవారం న్యూఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర బృందం నేషనల్‌ లెవెల్‌ మానిటరింగ్‌ టీం లీడర్లు అశోక్‌కుమార్‌, సాసో అండర్‌ సెక్రటరీ రబల్‌కుమార్‌, ఎకనామిక్‌ అధికారి మోర్డు జిల్లాలో కేంద్ర నిధుల వినియోగంపై విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా వారు స్థానిక చంద్రునిపేటలో ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద నిర్మించిన గృహలను పరిశీలించారు. అలాగే పడమటి వీధిలో పీఎంఈజీపీ పథకం కింద ఏర్పాటు చేసుకున్న గేదెల యూనిట్‌ను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పీఎంఈజీపీ పథకం ద్వారా కుటుంబ జీవన ప్రామాణాలు పెరిగాయా అనే అంశంపై విచారణ చేశారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ శ్రీధర్‌రెడ్డి, ఏఓ సుబ్రమణ్యం, డిప్యూటీ ఎంపీడీఓ ప్రసాదరెడ్డి, ఏపీడీ సాంబశివరావు, ఏపీఓ గౌరీబాయ్‌ డిప్యూటీ తహసీల్దార్‌ చంద్రశేఖర్‌, హౌసింగ్‌ ఏఈ నాగరాజు, ఏపీఎం వసంతకుమారి ఉన్నారు.

నంద్యాల: జిల్లాలో భూగర్భ జలాల శాతాన్ని గణనీయంగా పెంచేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ రాజకుమారి మండల స్థాయి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాలులో ‘జలధార – జలహారతి’ కార్యక్రమంపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి, పనుల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. జిల్లాలో జలవనరులన్నింటినీ క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి, యథావిధిగా పునరుద్ధరించడం ద్వారా భూగర్భ జలాల స్థాయి క్రమంగా పెరుగుతోందని వెల్లడించారు. ఉపాధి హామీ పనులను శాతం వంద పూర్తిచేయాలన్నారు. అలాగే వాగులు, చెరువులపై ఉన్న ఆక్రమణలను వెంటనే గుర్తించి తొలగించేందుకు తహసీల్దార్లు తక్షణ చర్యలు చేపట్టాలని తెలిపారు. సమావేశంలో జిల్లా భూగర్భ శాఖ అధికారి రఘురాం, జలవనరుల శాఖ అధికారి శివ శంకర్‌, డ్వామా పీడీ సూర్యనారాయణ మూర్తి, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

శ్రీశైలంటెంపుల్‌: లోక కల్యాణం కోసం జగన్మాత అయిన శ్రీభ్రమరాంబాదేవికి వార్షిక కుంభోత్సవా న్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. కుంభోత్సవంలో భాగంగా ప్రత్యేక పూజలు, కుంభహారతి, సాత్వికబలి, అన్నాభిషేకం తదితర కార్యక్రమాలు శాస్త్రోక్తంగా చేపట్టారు. ఏటా చైత్రమాసంలో పౌర్ణమి తరువాత వచ్చే మంగళ, శుక్రవారాల్లో ఏ రోజు ముందుగా వస్తే ఆ రోజు అమ్మవారికి సాత్వి కబలిని సమర్పించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ మేరకు శ్రీశైల మహాక్షేత్రంలోమంగళవారం అమ్మవారి కుంభోత్సవాన్ని పురస్కరించుకుని అర్చకులు ముందుగా లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ ఉత్సవ సంకల్పం పఠించారు. ప్రాతఃకాల పూజల అనంతరం అమ్మవారికి నవావరణపూజ, త్రిశతి, ఖడ్గమాల, అష్టోత్తర కుంకుమ పూజలు, జపపారాయణలు నిర్వహించారు. ఆచారాన్ని అనుసరించి ఈ పూజలన్నీ అమ్మవారికి ఏకాంతంగా చేపట్టారు. అలాగే శాంతి ప్రక్రియలో భాగంగా అధిక పరిమాణంలో పసుపు, కుంకుమలను కూడా అమ్మవారికి సమర్పించారు. అమ్మవారికి ఏకాంతంగా పూజలు చేసిన తరువాత సాత్వికబలికి సిద్ధం చేసిన ఐదు వేలకుపైగా కొబ్బరికాయలు, 20 వేల గుమ్మడికాయలు, లక్షకు పైగా నిమ్మకాయలు, వండిన అన్నం (కుంభం)కు కూడా పూజలు చేపట్టారు. స్థానిక వ్యాపార సంఘం వారు గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, వండిన అన్నం అమ్మవారికి సాత్వికబలిగా సమర్పించారు. తొలి విడత సాత్వికబలి అనంతరం హరిహరరాయగోపుర ద్వారం వద్ద ఉన్న మహిషాసురమర్ధిని అమ్మవారికి (కోటమ్మవారికి) ప్రత్యేక పూజలు చేసి సాత్వికబలిగా కొబ్బరికాయలు, గుమ్మడికాయలు సమర్పించారు.

అమ్మవారికి కుంభహారతి..

సంప్రదాయాన్ని అనుసరించి సీ్త్ర వేషంలో ఉన్న పురుషుడు అమ్మవారికి కుంభహారతి సమర్పించారు. దీంతో ఉత్సవంలో ప్రధానఘట్టం ప్రారంభమైంది. అనంతరం రెండో విడత సాత్వికబలిగా గుమ్మడికాయలు, కొబ్బరికాయలు సమర్పించారు. సాయంత్రం శ్రీమల్లికార్జున స్వామివారికి ప్రదోషకాలపూజల అనంతరం అన్నాభిషేకం జరిపించారు. అలాగే అమ్మవారికి ఎదురుగా ఉండేవిధంగా సింహమండపం వద్ద వండిన అన్నాన్ని కుంభరాశిగా సమర్పించారు. కుంభోత్సవ పూజ కార్యక్రమాల్లో శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు దంపతులు, ధర్మకర్తల మండలి సభ్యులు, ఏఈవో, పర్యవేక్షకులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

నిజరూప దర్శనంతో పులకించిన భక్తులు

శ్రీభ్రమరాంబాదేవికి విశేషపూజలు నిర్వహించిన అనంతరం అమ్మవారి నిజరూప దర్శనం భక్తులకు కలిగించారు. వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని తరించారు. చివరిగా అమ్మవారికి పునఃపూజలను చేసి పలు రకాల వంటకాలతో అమ్మవారికి మహానివేదన చేశారు. ఈ ఉత్సవంలో భాగంగానే గ్రామదేవత అంకాళమ్మకు కూడా ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కుంభరాశి వద్ద పూజలు చేస్తున్న భక్తులు

ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించిన దృశ్యం కుంభహారతితో వస్తున్న స్త్రీ వేషదారణలో పురుషుడు మహిషాసురమర్ధినికి పూజలు చేస్తున్న దృశ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement