కర్నూలు: పోలీసు శాఖ సర్వీసులోని ఏఎస్‌ఐలు/హెడ్ కానిస్టేబుళ్లకు కర్నూలు శివారులోని జగన్నాథగట్టుపై ఉన్న పోలీసు శిక్షణ కళాశాలలో మంగళవారం సబ్ ఇన్‌స్పెక్టర్ పదోన్నతి ఎంపిక పరీక్షలు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య నిర్వహించారు. ఏపీఎస్పీ రెండో బెటాలియన్ కమాండెంట్ దీపిక పాటిల్ పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించారు. రాయలసీమ జోన్ పరిధిలోని ఏఎస్‌ఐలు/హెడ్ కానిస్టేబుళ్లు 72 మంది ఈ పరీక్షకు హాజరయ్యారు. డ్రిల్, ఆయుధాలపై పరిజ్ఞానం, నేర స్థల పరిశీలన, మౌఖిక పరీక్ష (ఓరల్ టెస్ట్) తదితర అంశాలపై బుధవారం పరీక్ష నిర్వహించనున్నారు. ఆయా పరీక్షలలో ప్రతిభ కనపరచిన వారికి సబ్ ఇన్‌స్పెక్టర్లుగా పదోన్నతి కల్పిస్తారు. డీటీసీ కళాశాల ప్రిన్సిపాల్ హుసేన్ పీరా, వైస్ ప్రిన్సిపాల్ దుర్గాప్రసాద్ డీఎస్పీలు శ్రీనివాసులు, బాలస్వామి రెడ్డి, సూర్యనారాయణ రెడ్డి, పోలీస్ వెల్ఫేర్ హాస్పిటల్ డాక్టర్ స్రవంతి, నన్నూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ నందిని, కర్నూలు రేంజ్ డీఐజీ కార్యాలయ మేనేజర్ రత్నప్రకాష్‌తో సీఐలు, ఎస్‌ఐలు కార్యక్రమంలో పాల్గొన్నారు.


