కుంభోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

కుంభోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు

Apr 2 2026 8:46 AM | Updated on Apr 2 2026 8:46 AM

శ్రీశైలంటెంపుల్‌: శ్రీశైల మహాక్షేత్రంలో ఈ నెల 7వ తేదీన నిర్వహించే భ్రమరాంబాదేవి కుంభోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఈఓ శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. వార్షిక కుంభోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం దేవస్థాన పరిపాలన భవనంలో ఈఓ అధ్యక్షతన సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ.. అమ్మవారికి కుంభోత్సవ కై ంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరిపించాలన్నారు. అమ్మ వారి దర్శనానికి భక్తుల రద్దీ దృష్ట్యా క్యూలైన్లలో తొక్కిసలాట లేకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. కుంభోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 7న అన్ని ఆర్జిత సేవలు నిలుపుదల చేశామన్నారు. అలాగే 8వ తేదీ ఉదయం 7.30 గంటల నుంచి దర్శనాలు, ఆర్జితసేవలు మొదలవుతాయని తెలిపారు. దేవదాయ చట్టాన్ని అనుసరించి క్షేత్ర పరిధిలో జంతు, పక్షి బలులు, జీవహింస పూర్తిగా నిషేధించబడిందన్నారు. ఈ విషయమై భక్తులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. ఇందుకు రెవెన్యూ, పోలీసు శాఖల సహకారం తీసుకోవాలని ఆదేశించారు. కుంభోత్సవం నేపథ్యంలో ఈనెల 6, 7 తేదీల్లో సున్నిపెంటలో మద్యం దుకాణాలను మూసి వేసేలా తగు ఉత్తర్వులు ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌కు లేఖ రాసినట్లు ఈఓ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement