పంచాయతీ నిధులపై పచ్చ పెత్తనం | - | Sakshi
Sakshi News home page

పంచాయతీ నిధులపై పచ్చ పెత్తనం

Apr 2 2026 8:46 AM | Updated on Apr 2 2026 8:46 AM

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: రాష్ట్రంలో కూటమి ప్రభు త్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ నాయకుల ఆర్థిక దోపిడీకి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. టీడీపీ నాయ కులు ఏకంగా సర్పంచ్‌ల హక్కులను కాలరాస్తున్నారు. గొర్విమానుపల్లె సర్పంచ్‌ బోయ రామాంజనేయులు రెండు రోజుల క్రితం మండల సర్వసభ్య సమావేశంలో వెల్లడించిన వాస్తవాలు విస్తుగొల్పాయి. సర్పంచ్‌ ప్రమేయం లేకుండా పంచాయతీ నిధులను పంచాయతీ కార్యదర్శి సాయంతో అదే గ్రామానికి చెందిన టీడీపీ మండల అధ్యక్షుడు మూలె రామేశ్వరెడ్డి తన వ్యక్తిగత అకౌంట్‌లోకి మళ్లించుకున్నట్లు మండల మీట్‌లో అధికారులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యుల సమక్షంలోనే జెడ్పీచైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డికి ఫిర్యాదు చేశారు. గ్రామాభివృద్ధి కోసం అప్పులు చేసి చేసిన పనులకు సైతం బిల్లులు చేయకుండా నిలుపుదల చేయించారని సర్పంచ్‌ ఆరోపించారు.

అంతా ఆయన కనుసన్నుల్లోనే..

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావ డంతో గొర్విమానుపల్లెలో టీడీపీ మండల అధ్యక్షుడు చేతుల్లోకి పంచాయతీ పాలన వెళ్లిందనే ఆరోపణలు ఉన్నాయి. ప్రజల చేత ఎన్నుకోబడిన సర్పంచ్‌ను రెండేళ్ల నుంచి పూర్తిగా పక్కకు నెట్టి అన్నీ తానై వ్యహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. దీనికి అధికారులు కూడా జీహుజూర్‌ అన్నారు. రూ.3 లక్షలకు పైగానే పంచా యతీ నిధులు ఆయన ఖాతాలోకి జమ అయినట్లు తెలుస్తోంది. మండల మీట్‌లో సర్పంచ్‌ ఆరోపించిన విషయం బయటకు పొక్కడంతో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మూలె రామేశ్వరరెడ్డి పేరు మీదనే పంచాయతీ నిధులు జమ అయినట్లు సాక్ష్యాధారాలు సైతం వెలుగు చూశాయి. వాస్తవాలు బట్టబయలు కావడంతో దిద్దుబాటు చర్యలకు దిగినట్లు సమాచారం. బీసీ సామాజిక వర్గానికి చెందిన సర్పంచ్‌కు తెలియకుండానే కార్యదర్శిని అడ్డుపెట్టుకొని నిధులు కొల్లగొట్టడంపై బీసీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణమైన పంచాయతీ కార్యదర్శితో పాటు నిధులను సొంత ఖాతాలోకి మళ్లించుకున్న టీడీపీ మండల అధ్యక్షుడిపై చర్యలు తీసుకోవాలని మరో వైపు సీపీఐ నాయకులు డిమాండ్‌ చేస్తున్నా రు. ఈ విషయంపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

సర్పంచ్‌కు తెలియకుండానే

నిధుల మళ్లింపు

కార్యదర్శి సాయంతో

టీడీపీ నేత అకౌంట్‌లో జమ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement