ఓర్వకల్లులో 18 బైకులు దగ్ధం | - | Sakshi
Sakshi News home page

ఓర్వకల్లులో 18 బైకులు దగ్ధం

Mar 23 2026 9:03 AM | Updated on Mar 23 2026 9:03 AM

ఓర్వకల్లు: మెకానిక్‌ వద్దకు తీసుకొచ్చిన 18 బైకులు నిప్పంటుకొని దగ్ధమయ్యాయి. ఓర్వకల్లులోని ఓ మెకానిక్‌ షెడ్‌ వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకొంది. స్థానికుల వివరాల మేరకు.. తిప్పాయపల్లె గ్రామానికి చెందిన శంకర్‌ అనే వ్యక్తి కొన్నేళ్లుగా ఓర్వకల్లు బస్టాండ్‌ సమీపాన మెకానిక్‌ షాపు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. ప్రతి రోజు ఉదయం షాపు వద్దకు వచ్చి, రాత్రి ఇంటికి వెళ్లేవాడు. ఆదివారం తెల్లవారు జామున ఓ బైక్‌ నుంచి మంటలు వ్యాపించి మొత్తం 18 దగ్ధమైనట్లు స్థానికులు చెప్పారు. సమీపంలోని ట్యాంకర్‌ ద్వారా నీటితో అతికష్టం మీద మంటలను అదుపు చేశారు. ఈ దుర్ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా.. దుండగుల దుశ్చర్య అనే విషయాలు తెలియరాలేదు.

25న హుండీల లెక్కింపు

కౌతాళం: ఉరుకుంద ఈరన్నస్వామి ఆలయంలో ఈనెల 25న హుండీల్లో కానుకల లెక్కింపు ఉంటుందని ఆలయ డిప్యూటీ కమిషనర్‌ వాణి తెలిపారు. దేవాలయ ప్రాంగణంలో పోలీస్‌ బందోబస్తు మధ్య హుండీలను తెరిచి లెక్కిస్తామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement