చిత్రంలో సిలిండర్లున్నాయి, కానీ జనాలు కనిపించడం లేదని సందేహం వస్తుందా.. గంటల తరబడి క్యూలో నిలబడలేక ఖాళీ సిలిండర్లను క్యూలో పెట్టాల్సి వస్తోంది. గ్యాస్ కొరతతో వినియోగదారులు అవస్థలు పడుతున్నారు. ఈ దృశ్యం మహానంది మండల కేంద్రమైన ఎం.తిమ్మాపురంలోని భారత్ గ్యాస్ ఏజెన్సీ గోడౌన్ వద్ద ఆదివారం కనిపించింది. గ్రామంలోని గ్యాస్ ఏజెజేన్సీపై గతంలో ఐవీఆర్‌ఎస్ కాల్స్ ద్వారా ఫిర్యాదులు వెళ్లడం, విచారణకు వచ్చిన అధికారులు రద్దు చేయడం చేశారు. అయితే మళ్లీ పాతవారే నిర్వహణ బాధ్యతలు తీసుకోవడంతో సమస్యలు మళ్లీ మొదటి కొచ్చాయనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. – మహానంది


