అటవీశాఖలో ఇక డిజిటల్ చెల్లింపులు
ఆత్మకూరురూరల్: శ్రీశైలం పరిధిలోని శిఖరం, లింగాలగట్టు చెక్ పోస్టుల్లో పర్యావరణ సెస్‌ను క్యూర్ కోడ్‌తో వసూలు చేయనున్నారు. అలాగే సాక్షిగణపతి వద్ద పార్కింగ్ ఫీజును డిజిటల్ విధానంలో తీసుకోనున్నారు. ఎన్‌ఎస్‌టీఆర్ పరిధిలోని ఆత్మకూరు డివిజన్‌లో జరిగిన పొరబాటుకు అటవీశాఖ ఈ చర్యలు చేపట్టింది. అటవీ శాఖ చెక్ పోస్ట్‌ల నుంచి సుమారు రూ.4 కోట్ల సొమ్మును ఉద్యోగి చాంద్ బాషా ఇతర ఖాతాలకు దారి మళ్ళించిన సంగతి తెలిసిందే. ఈకేసులో ఆయన అరెస్ట్ అయి విచారణ ఎదుర్కొంటున్నారు. ఈ నేరం మరోసారి జరగకూడదని ఆత్మకూరు అటవీ డివిజన్ నుంచి నూతన పద్ధతులకు శ్రీకారం చుట్టారు. అంతే కాకుండా ఆయా చెక్ పోస్టులు, పార్కింగ్‌ల వద్ద సీసీ కెమెరాలు అమర్చారు. కమాండ్ కంట్రోల్ ఆత్మకూరు డీడీ కార్యాలయంలో పర్యవేక్షించనున్నారు. బైర్లూటి చెక్‌పోస్ట్ వద్ద సెల్ సిగ్నల్‌లు బలహీనంగా ఉండటంతో ప్రత్యామ్నాయాల కోసం చూస్తున్నారు. డిజిటలైజేషన్ కార్యక్రమాన్ని ఆత్మకూరు డీడీ విఘ్నేష్ అపావ్, సూపరిన్‌డెంట్ చంద్రశేఖర్ రాజులు పర్యవేక్షిస్తున్నారు.


