కనిపించని పెద్ద డాక్టర్లు
నిబంధనల ప్రకారం ఓపీ విభాగంలో రోగులకు చికిత్స అందించేందుకు తప్పని సరిగా ఆయా విభాగాలకు సంబంధించిన అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లు ఉండాలి. దీని పర్యవేక్షణలో పీజీ వైద్యులు ఉండి రోగులకు చికిత్స చేయాల్సి ఉంది. జిల్లా ఆసుపత్రిలో మాత్రం అలాంటి పరిస్థితులు లేకుండా అసలు డాక్టర్లు లేకుండానే జూనియర్లు, సీనియర్ రెసిడెంట్లు వైద్య సేవలు అందిస్తున్నారు.
గోస్పాడు: నంద్యాల జిల్లా ఆసుపత్రిలో పేద ప్రజలకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందడం లేదు. ఉద యం 9గంటల నుంచి సాయంత్రం 4.30గంటల వరకు కొందరు వైద్యులు అందుబాటులో ఉండటం లే దు. ఆసుపత్రికి జిల్లా ప్రజలతో పాటు అత్యవసర ప రిస్థితులలో సమీప జిల్లాలు కడప, ప్రకాశం సరిహద్దు ప్రాంతాల నుంచి రోగులు కూడా వస్తుంటారు. దాదాపుగా 1,200 నుంచి 1,400 మంది దాకా ప్రతిరోజు ఓపీ ఉంటూ ఎంతో రద్దీగా ఉంటుంది. పెద్ద డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో జూనియర్, సీనియర్ రెసిడెంటు వైద్యులు రోగులకు వైద్యం చేసున్నారు.
కానరాని వైద్యులు
ఉదయం తర్వాత మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు ఓపీ(ఔట్ పేషెంట్ల)ను వైద్యులు చూడాల్సి ఉంది. అయితే వివిధ రోగాలతో బాధపడుతూ వచ్చిన ప్రజలు వైద్యుల కోసం నిరీక్షిస్తూ కూర్చుండి పోవాల్సివస్తోంది. ఉదయం వైద్య పరీక్షలు చేయించుకొని వాటి రిపోర్టులు చూపించేందుకు కూడా కొంతమంది రోగులు అక్కడే ఉండాల్సిన పరిస్థితి వస్తోంది. మూడు గంటలకు రావాల్సిన వైద్యులు వారివారి ఓపీలకు సక్రమంగా రావటం లేదు. జూనియర్, సీనియర్ రెసిడెంటు డాక్టర్లు కూడా వారికిష్టమైనప్పుడు వస్తున్నారు. దీంతో ఆసుపత్రిలోని పలు విభాగాల్లో రోగులకు సరైన వైద్య సేవలు అందడం లేదు.
ఒక్కటితోనే సరి
రోగులకు వైద్యసేవలందించేందుకు ఆసుపత్రిలో జనరల్ మెడిసిన్, మానసిక వ్యాధుల విభాగాల్లో మా త్రమే డాక్టర్లు ఉంటున్నారు. ఎముకలు, శస్త్రచికిత్సలు, చర్మ వ్యాధుల విబాగంలో రెండేసీ ఓపీ విభాగాలు ఉన్నా వాటిలో ఒక్కటే మధ్యాహ్నవేళల్లో తలుపులు తెరుచుకుంటున్నాయి. ఉన్న ఒక్కచోటైనా డాక్టర్లు సక్రమంగా రాక రోగులకు జూనియర్, సీనియర్ రెసిడెంటు డాక్టర్లు వైద్యసేవలు చేయాల్సి వస్తుంది.
కొరవడిన పర్యవేక్షణ
నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో పెద్ద డాక్టర్లపై పర్యవేక్షణ లేకపోవడంతోనే వారు మొక్కుబడిగా విధులు నిర్వహిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. మధ్యాహ్నం భోజన విరామం అనంతరం గంట పాటు నిర్వహించే ఓపీ సేవల్లో ఎప్పుడు ఎవరు వస్తున్నారో, ఎవరు వెళ్తున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. కొంత మంది వైద్యులు విధులకు సమయపాలన పాటించకుండా మొక్కుబడిగా వచ్చి వెళ్లిపోతున్నారు. ఓపీ విభాగాల్లో జూనియర్ వైద్యులు వ్యాధుల నిర్ధారణ కోసం వారే వైద్య పరీక్షలకు రాసి పంపుతున్నారు. విధులకు ఎవరు ఎప్పుడు వస్తున్నారన్న విషయాన్ని ఆసుపత్రి అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. అధికారుల పర్యవేక్షణ కొరవడటంతోనే ఈ తంతు కొనసాగుతోంది.
నంద్యాల జిల్లా ఆసుపత్రికి ప్రతి రోజు అధిక సంఖ్యలో రోగులు వస్తున్నారు. ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలతో పాటు సదుపాయాలు ఉన్నాయి. ఆసుపత్రికి రోగాలతో వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవలు అందిస్తున్నాం. ఓపీ విభాగాల్లో ప్రతి ఒక్కరు సమయపాలన పాటించేలా చర్యలు చేపట్టాం. సమయానికి లేకపోతే చర్యలు తీసుకుంటాం.
– డాక్టర్ జిలానీ, ఇన్‌చార్జి సూపరింటెండెంట్,
జిల్లా ఆసుపత్రి, నంద్యాల
జిల్లా ఆసుపత్రిలో డాక్టర్ల రాక కోసం
ఎదురుచూపులు
ఒకటి, రెండు విభాగాల్లోనే
కనిపిస్తున్న వైద్యులు
ప్రతి రోజూ 1,200 నుంచి
1,400 దాకా ఓపీలు
గంటల తరబడి నిరీక్షణ
బయటి ప్రాంతాలకు వెళ్లిపోతున్న
రోగులు
పట్టించుకోని అధికారులు
కనిపించని పెద్ద డాక్టర్లు
కనిపించని పెద్ద డాక్టర్లు
కనిపించని పెద్ద డాక్టర్లు


