రేగు పండ్ల కోసం వెళ్లి...
● బావిలో పడి బాలుడి మృతి
శిరివెళ్ల: రేగు పండ్ల కోసం వెళ్లిన బాలుడు తలారి రఘరాం (7) వైన్ షాపు వెనుక ఉన్న బావిలో పడి మృతి చెందాడు. ఈ దుర్ఘటన గోవిందపల్లెలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ చిన్న పీరయ్య తెలిపిన వివరాల మేరకు.. గోవిందపల్లెకు చెందిన తలారి రఘరాం ఈ నెల 6వ తేదీ సాయంత్రం తోటి పిల్లలతో కలసి రేగు పండ్ల కోసం కామినేనిపల్లె రస్తాకు వెళ్లారు. అక్కడ వైన్ షాపు వెనుక ఉన్న బావిలో ప్రమాదవశాత్తు పడ్డాడు. ఈ విషయాన్ని తోటి పిల్లలు చెప్పలేదు. ఆందోళనతో తల్లి మల్లేశ్వరి గ్రామంలో, బంధువుల వద్ద వెతికారు. బుధవారం గ్రామం వెలుపల బావిలో చూడగా బాలుడు మృతి దేహం కనిపించింది. బాలుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.


