విజయ డెయిరీలో ఖా‘కీచక’ రాజకీయం
నంద్యాల(అర్బన్): నంద్యాల విజయ డెయిరీలో టీడీపీ నాయకులు ఖా‘కీచక’ రాజకీయం చేస్తున్నారు. డెయిరీలో సోమవారం చాగలమర్రి మండలం ముత్యాలపాడు పాల సొసైటీ సభ్యులతో జరగాల్సిన త్రిసభ్య కమిటీ సమావేశాన్ని పోలీసులతో అడ్డుకున్నారు. సమావేశానికి వెళ్లకుండా సభ్యులు పీపీ మధుసూదన్‌రెడ్డి, గంగుల విజయసింహారెడ్డిని హౌస్ అరెస్ట్‌లు చేశారు. భూమా విఖ్యాత్‌రెడ్డి కోసం పోలీసులను అడ్డు పెట్టుకొని తమను సమావేశానికి రాకుండా అడ్డుకున్నారని త్రిసభ్య కమిటీ సభ్యులు ఆరోపించారు.
చూస్తూ ఊరుకోం..
హౌస్‌అరెస్ట్ చేసిన పీపీ మధుసూదన్‌రెడ్డిని ఆయన నివాస గృహంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా, ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి పరామర్శించారు. అనంతరం కాటసాని రాంభూపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. పోలీసులను అడ్డుపెట్టుకొని భయపెట్టే రోజులు సాగబోవన్నారు. త్రిసభ్య కమిటీకి హాజరు కాకుండా సభ్యులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం తగదన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, చట్టానికి విరుద్ధంగా ఎవరు వ్యవహరించినా చూస్తూ ఊరుకోబోమన్నారు. బెదిరింపులకు దిగితే గట్టిగా సమాధానం చెబుతామన్నారు.
కుటిల రాజకీయం
పీపీ మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ.. భూమా విఖ్యాత్‌రెడ్డి ప్రైవేటు డెయిరీని స్థాపించి అక్రమంగా 2020లో డెయిరీ నుంచి రూ.1.20 కోట్లు అప్పు తీసుకొని తిరిగి చెల్లించలేదన్నారు. పాల సొసైటీ అధ్యక్షుడిగా ఉన్న చక్రవర్తులపల్లె సొసైటీని 2024 డిసెంబర్‌లో డెయిరీ పాలక వర్గం రద్దు చేసిందన్నారు. డీఫాల్టర్ అయిన విఖ్యాత్‌కు ముత్యాలపాడు పాల సొసైటీలో సభ్యత్వం ఇవ్వడమే కాకుండా అధ్యక్షుడిగా ఎలా చేస్తారంటూ పాల సొసైటీ సభ్యులకు నోటీసులు ఇచ్చామన్నారు. తనకే నోటీసులు ఇచ్చారంటూ 20 రోజుల క్రితం డెయిరీ వద్దకు వచ్చి విఖ్యాత్ రభస చేయడం సరైంది కాదన్నారు. పాలకవర్గ సభ్యులతో సమావేశం నిర్వహిస్తున్నామని తెలిసి త్రిసభ్య కమిటీ సభ్యులమైన తనను, విజయసింహారెడ్డి, రమాకాంత్‌రెడ్డిలను హౌస్ అరెస్ట్ చేయడం కుటిల రాజకీయానికి నిదర్శనమన్నారు. పోలీసులను అడ్డు పెట్టుకొని టీడీపీ నేతలు చేస్తున్న ప్రయత్నాలు మానుకోకపోతే గట్టిగా సమాధానం చెబుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు దాల్‌మీల్ అమీర్, మాజీ జెడ్పీటీసీ సూర్యనారాయణరెడ్డి, దేశం సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సభ్యులను హౌస్ అరెస్ట్ చేసిన
పోలీసులు
త్రిసభ్య కమిటీ సమావేశానికి
వెళ్లకుండా అడ్డగింత
చూస్తూ ఊరుకోమని
వైఎస్సార్‌సీపీ నేతల ఆగ్రహం
విజయ డెయిరీలో ఖా‘కీచక’ రాజకీయం


