గజవాహనంపై మద్దిలేటి స్వామి వైభవం
బేతంచెర్ల: ముక్కోటి ఏకాదశి ఉత్సవాలను పురస్కరించుకొని ఆర్‌ఎస్ రంగాపురంలోని మద్దిలేటి స్వామి క్షేత్రంలో సోమవారం రాత్రి గజవాహన సేవ నిర్వహించారు. భారీగా తరలివచ్చిన భక్తుల మధ్య గజవాహనంపై స్వామిని క్షేత్ర పుర వీధుల్లో వైభవంగా ఊరేగించారు. వేడుకల్లో భాగంగా ప్రత్యేక మండపంలో మద్దిలేటి స్వామి ఉత్సవ మూర్తిని ప్రత్యేక అలంకారంలో కొలువుంచారు. సహస్రదీపాలంకరణ సేవ నిర్వహించారు. స్వామి, అమ్మవార్లకు పండితులు జ్వాలా చక్రవర్తి, కళ్యాణచక్రవర్తి పూజలు చేశారు. అనంతరం ఆలయ ఆవరణంలో గజవాహనంపై సత్యనారాయణ మూర్తి అలంకారంలో శ్రీ మద్దిలేటి నరసింహ స్వామిని కొలువుంచారు. భక్తజనం మధ్య మంగళవాయిద్యాలతో గజవాహనంపై ఊరేగింపు నిర్వహించారు. ఉపకమిషనర్ రామాంజనేయులు, అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గజవాహనంపై మద్దిలేటి స్వామి వైభవం


