పీజీఆర్‌ఎస్‌కు 45 ఫిర్యాదులు | - | Sakshi
Sakshi News home page

పీజీఆర్‌ఎస్‌కు 45 ఫిర్యాదులు

Dec 2 2025 7:22 AM | Updated on Dec 2 2025 7:22 AM

పీజీఆ

పీజీఆర్‌ఎస్‌కు 45 ఫిర్యాదులు

నంద్యాల: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌)కు 45 పిర్యాదులు వచ్చాయని ఎస్పీ సునీల్‌ షెరాన్‌ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. చట్ట పరిధిలో ఉన్న సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని, నిర్ణీత గడువు లోపల ఫిర్యాదులను పరిష్కరించాలని పోలీస్‌ అధికారులను ఆదేశించారు. ఫిర్యాదులు పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు.

జావలిన్‌త్రో పోటీల్లో ప్రథమం

కొలిమిగుండ్ల: స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థి మధు హేమంత్‌ జావలిన్‌త్రో పోటీల్లో ప్రతిభ చూపి ప్రథమ స్థానంలో నిలిచాడు. పారా ఒలింపిక్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సోమవారం నంద్యాల ఎస్పీజీ మైదానంలో జిల్లా స్థాయి పోటీలు నిర్వహించారు. మొత్తం 130 మంది విద్యార్థులు పాల్గొనగా మధు మేహంత్‌ మొదటి స్థానాన్ని పొందాడు. ఈ విద్యార్థికి జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్‌ రెడ్డి, ఐఈకో ఆర్డినేటర్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రశంసాపత్రాన్ని ఇచ్చారు. కాగా.. గతేడాది ఏలూరులో జరిగిన 200 మీటర్ల పరుగు పందెంలోనూ మధు హేమంత్‌ విజేతగా నిలిచాడు.

కార్తీకమాస శివదీక్ష విరమణ

శ్రీశైలంటెంపుల్‌: పంచాక్షరీ నామస్మరణతో జ్యోతిర్ముడిని సమర్పించి సోమవారం భక్తులు కార్తీకమాస శివదీక్షను విరమించారు. దేవస్థానంలోని ప్రత్యేక శిబిరాల్లో ఐదు రోజుల పాటు శివదీక్షను విమరించేందుకు ఏర్పాట్లు చేశారు. సోమవారం స్వామివారి ఆలయ దక్షిణద్వారం వద్ద స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకీలో అధిష్టింపజేసి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం స్వామిఅమ్మవార్లను మంగళవాయిద్యాల నడుమ వేదమంత్రాలతో రథవీధిలో ఊరేగింపుగా తీసుకొని వెళ్లి శివదీక్షా శిబిరాల్లో కొలువుంచారు. స్వామిఅమ్మవార్లకు షోడశోపచారలతో పూజాదికాలు నిర్వహించారు. దేవస్థానం ట్రస్ట్‌బోర్డు చైర్మన్‌ పి.రమేష్‌నాయుడు, స్వామివార్ల ప్రధానార్చకులు, అర్చకులు పాల్గొన్నారు. శివదీక్షా విరమణ కార్యక్రమం పూర్తయ్యేంత వరకు శిబిరాల్లోని దేవతామూర్తులకు ఉభయ సంధ్యలలో శాస్త్రోక్తంగా పూజాదికాలు జరిపిస్తారు.

టీడీపీ నేత భూ కబ్జా

కలెక్టరేట్‌ ఎదుట మాజీ సైనికుల ధర్నా

కర్నూలు(సెంట్రల్‌): కర్నూలు రూరల్‌ మండలం నందనపల్లి గ్రామ పంచాయతీలో మాజీ సైనికులకు ఇచ్చిన భూములకు టీడీపీ నేత రవిగౌడ్‌ కబ్జా చేశాడని బాధిత మాజీ సైనికులు రవి, జాన్‌, విజయ్‌, రాజు,శీను, రాముడు, బుజ్జి, సంజన్న, చిన్న మద్దిలేటి, థామస్‌, రంగన్న, గురునాథ్‌ ఆరోపించారు. మాజీ సైనికుల ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న 72 మందికి నందనపల్లెలో కుటుంబానికి 6.5 ఎకరాల భూమిని ఇచ్చారన్నారు. అయితే నందికొట్కూరు నుంచి వలస వచ్చిన టీడీపీ నేత రవిగౌడ్‌ కబ్జాలకు పాల్పడుతున్నారన్నారు. ఎవరైనా ఏమైనా ఉంటే తనకు మంత్రి తెలుసు.. ఎమ్మెలే తెలుసూ అంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు చెప్పారు. అంతకముందు రవిగౌడ్‌పై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు.

పీజీఆర్‌ఎస్‌కు 45 ఫిర్యాదులు 1
1/3

పీజీఆర్‌ఎస్‌కు 45 ఫిర్యాదులు

పీజీఆర్‌ఎస్‌కు 45 ఫిర్యాదులు 2
2/3

పీజీఆర్‌ఎస్‌కు 45 ఫిర్యాదులు

పీజీఆర్‌ఎస్‌కు 45 ఫిర్యాదులు 3
3/3

పీజీఆర్‌ఎస్‌కు 45 ఫిర్యాదులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement