కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలి
కర్నూలు : రాజీ పూర్వకంగా పరిష్కరించేందుకు అవకాశమున్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ కబర్ధి పోలీసు అధికారులకు సూచించారు. డిసెంబర్ 13న జరిగే జాతీయ లోక్ అదాలత్‌పై ఉమ్మడి జిల్లా పోలీసు అధికారులతో జిల్లా కోర్టులోని న్యాయ సేవా సదన్‌లో జి.కబర్ధి, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న రాజీ కాదగిన కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు, ఎకై ్సజ్ కేసులు త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని వారు అధికారులకు సూచించారు. జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువగా క్రిమినల్ కేసులు పరిష్కారమయ్యేలా చూడాలన్నారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు కూడా వినియోగించుకుని వారి కేసులను రాజీపూర్వకంగా పరిష్కరించుకోవాలని సూచించారు. పోక్సో కోర్టు అదనపు జిల్లా జడ్జి రాజేంద్రబాబు, మేజిస్ట్రేట్ అనిల్ కుమార్, అపర్ణ, అనూష, డీఎస్పీ వెంకటరామయ్య, ప్రమోద్ కుమార్, కర్నూలు దిశ పీఎస్ సీఐ రామయ్య నాయుడు, ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దీన్‌తో పాటు కర్నూలు, నంద్యాల జిల్లాల సీఐలు, ఎస్‌ఐలు కార్యక్రమంలో పాల్గొన్నారు.


