ఆకతాయికి దేహశుద్ధి
కోవెలకుంట్ల: స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయ సమీపంలో మంగళవా రం ఓ చిన్నారిపట్ల అసభ్యకరంగా ప్రవర్తించే ప్రయత్నం చేసిన ఆకతాయికి గ్రామస్తులు దేహశుద్ధి చేశారు. పట్టణానికి చెందిన ఓ మహిళ తన పిల్లలతో కిరాణా వస్తువులు కొనుక్కునేందుకు వచ్చింది. మహిళ షాపు వద్ద ఉండగా ఎనిమిది ఏళ్ల వయసున్న కుమార్తె అక్కడే రోడ్డుపై నిలుచుని ఉంది. అదే ప్రాంతంలో ఉన్న కోవెలకుంట్లకు చెందిన వెంకటేశ్వరరెడ్డి అలియాస్ బొంగు చిన్నారిపై చేతులు వేసి అసభ్యకరంగా ప్రవర్తించాడు. గమనించిన తల్లి వెంటనే అక్కడికి చేరుకుని నిలదీసింది. ఈ క్రమంలో ఆమెతోపాటు స్థానికులు ఆకతాయికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
శ్రీశైలం ఘాట్‌లో
ఆర్టీసీ బస్సు –బైక్ ఢీ
మరో యువకుడికి తీవ్ర గాయాలు
శ్రీశైలం: శ్రీశైలం ఘాట్ రోడ్‌లో మంగళవారం ఆర్టీసీ బస్సు–బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందగా మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. దోర్నాల పోలీసులు తెలిపిన వివరాలు.. ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన షేక్ ఖాజావలి (35), స్నేహితుడు ముండ్లమూడి పాలకొండ స్వామి శ్రీశైలం నుంచి బైక్‌పై దోర్నాల వస్తుండగా ఎదురుగా వస్తున్న మార్కాపురం డిపో బస్సు ఢీకొంది. బైక్ నడుపుతున్న ఖాజావలి అక్కడికక్కడే మృతిచెందగా స్నేహితుడు స్వామి తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని శ్రీశైలం ప్రాజెక్టు హాస్పిటల్‌కు తరలించారు. కాగా స్వామి శివమాలను శ్రీశైలం విరమణ చేసి తిరుగు ప్రయాణమైన సమయంలో ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు దోర్నాల పోలీసులు తెలిపారు.
ఆకతాయికి దేహశుద్ధి


