ఉపాధ్యాయులపైనే విద్యార్థుల భవిష్యత్తు
దొర్నిపాడు: ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపైనే ఉందని డీఈఓ జనార్ధన్‌రెడ్డి సూచించారు. మంగళవారం క్రిష్టిపాడు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. ఇటీవలే ఎంపీయూపీ నుంచి జెడ్పీహెచ్‌ఎస్‌గా అప్‌గ్రేడ్ కావడంతో వసతులు పరిశీలించేందుకు వచ్చారు. తరగతిగదులు ఎలా ఉన్నాయి, ఉపాధ్యాయులు పనితీరు, ఎంత మంది విద్యార్థులు ఉన్నారు అనే దానిపై ఆరా తీశారు. 9వ తరగతి విద్యార్థుల చదువు సామర్థ్యాలను పరిశీలించారు. 2026–2027 విద్యా సంవత్సరం నుంచి తొలిసారిగా పదవ తరగతి బ్యాచ్ విద్యార్థులు పరీక్షలకు సిద్ధం అవుతారన్నారు. మొదటి బ్యాచ్ పదవ తరగతిలో వందశాతం ఫలితాలు సాధించేలా కృషి చేయాలన్నారు. అనంతరం మధ్యాహ్నాభోజం పరిశీలించి విద్యార్థులతో కలిసి అక్కడే భోజనం చేశారు. పాఠశాల పనితీరు, విద్యార్థుల క్రమశిక్షణపై సంతృప్తి వ్యక్తం చేశారు. డీఈఓ వెంట ఎంఈఓలు మనోహర్‌రెడ్డి, రామచంద్రయ్య, హెచ్‌ఎం లక్ష్మయ్య తదితరులు ఉన్నారు.
నేడు శ్రీశైలం ట్రస్ట్ బోర్డు సమావేశం
శ్రీశైలం టెంపుల్: శ్రీశైలంలో బుధవారం దేవస్థాన ట్రస్టు బోర్డు సమావేశం నిర్వహించనున్నట్లు దేవస్థాన అధికారులు తెలిపారు. ఉదయం 10గంటలకు కమాండ్ కంట్రోల్ రూము వద్ద ఉన్న సమావేశ మందిరంలో జరిగే ఈ సమావేశంలో భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు, క్షేత్ర అభివృద్ధిపై చర్చించనున్నట్లు వెల్లడించారు.
వీబీఆర్‌లో చేప పిల్లల విడుదల
వెలుగోడు: వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో మంగళవారం ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా 21.15 లక్షల చేప పిల్లల విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ నంద్యాల జిల్లా జాయింట్ డైరెక్టర్ హిరా నాయక్, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్ కర్నూలు అబ్జర్వర్ డా.రంగనాథ్ బాబు, అసిస్టెంట్ డైరెక్టర్ రవికుమార్ పాల్గొన్నారు.
అనుమానితులపై
నిఘా అవసరం
నంద్యాల: పాత నేరస్తులు, నేరచరిత్ర గల వారి కదలికలు, అనుమానితులపై నిఘా ఉంచాలని నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ పోలీసులకు సూచించారు.మంగళవారంపట్టణంలోని త్రీటౌన్ పోలీసు స్టేషన్‌ను ఆయన అకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌లోని పలు రికార్డులను పరిశీలించి నేరచరిత్ర, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే వినతులను సత్వరమే పరిష్కరించాలని సీఐకు సూచించారు.
కర్నూలు: మద్యం తాగి వాహనాలు నడుపుతూ డ్రంకెన్ డ్రైవ్‌లో పోలీసులకు పట్టుబడిన వారికి కిక్కు దిగేలా న్యాయమూర్తి జరిమానా విధించారు. మద్యం సేవించి వాహనాలు నడపటం వల్లే ఇటీవల కాలంలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని భావించిన పోలీసు శాఖ జిల్లా వ్యాప్తంగా డ్రంకెన్ డ్రైవ్‌లను విస్తృతం చేసింది. ఇందులో భాగంగా ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దీన్ ఆధ్వర్యంలో నగరంలోని ముఖ్య కూడళ్లలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. మోతాదుకు మించి పట్టుబడిన 23 మందిని మంగళవారం జేఎఫ్‌సీఎం కోర్టులో హాజరుపర్చగా ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున జరిమానా విధిస్తూ జేఎఫ్‌సీఎం కోర్టు మెజిస్ట్రేట్ అపర్ణ తీర్పు చెప్పారు. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ట్రాఫిక్ సీఐ తెలిపారు.
ఉపాధ్యాయులపైనే విద్యార్థుల భవిష్యత్తు
ఉపాధ్యాయులపైనే విద్యార్థుల భవిష్యత్తు


