శ్రీమఠం హుండీ ఆదాయం రూ.5.41 కోట్లు
మంత్రాలయం రూరల్: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం మంత్రాలయంలో కొలువైన శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం హుండీ ఆదాయం రూ.5.41 కోట్లు వచ్చింది. మంగళవారం స్థానిక రాజ్యంగణ భవనంలో శ్రీమఠం హుండీ కానుకలు లెక్కించారు. 34 రోజులకు హుండీల్లో వచ్చిన నగదు లెక్కించగా రూ.5,26,89,128 వచ్చింది. నాణేల రూపంలో రూ.14,58,100 సమకూరింది. అంతేగాక 80 గ్రాముల బంగారం, వెండి 1,610 గ్రాములు వచ్చినట్లు శ్రీమఠం మేనేజర్–1 శ్రీనివాసరావు, మేనేజర్–2 వెంకట్‌ష్ జోషి, ఏఏఓ మాధవశెట్టి, ఏఈ కోనాపూర్ సురేష్ తెలిపారు.


